ETV Bharat / sports

Rahkeem Cornwall CPL Century : సీపీఎల్​​లో విండీస్​ 'బాహుబలి'​.. 12 సిక్స్​లతో విధ్వంసం.. వీడియో వైరల్ - కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023

Rahkeem Cornwall CPL Century : కరేబియన్ లీగ్​లో బాహుబలి ఇన్నింగ్స్​ నమోదైంది. విండీస్​ ప్లేయర్​ రఖీమ్​ కార్న్​వాల్​ 12 సిక్స్​లతో విధ్వంస సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అయింది. మీరూ చూసేయండి.

Rahkeem Cornwall Cpl Century
Rahkeem Cornwall Cpl Century
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 1:41 PM IST

Updated : Sep 4, 2023, 3:15 PM IST

Rahkeem Cornwall Cpl Century : కరేబియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో 12 సిక్స్​లతో విధ్వంసం సృష్టించాడు వెస్టిండీస్​ ప్లేయర్ రఖీమ్​ కార్న్​వాల్. సెంయిట్​ కిట్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో బార్బడోస్​ రాయల్స్​ ఆల్​ రౌండర్ రఖీమ్​.. 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ శతకంతో సీపీఎల్​లో ఇప్పటివరకు అత్యంత వేకంగా సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే టీ20ల్లో రఖీమ్​కు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం.

Caribbean Premier League 2023 : కరేబియన్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా సోమవారం బార్బడోస్ రాయల్స్​, సెయింట్ కిట్స్​ అండ్ నెవిస్ పాట్రియాట్స్​ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో సెయింట్ కిట్స్​ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని.. 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది రాయల్స్​. ఇందులో ఓపెనర్ రఖీమ్​ విధ్వంసకర ప్రదర్శనతో 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, 12 సిక్సర్లో 102 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేల్​ మేయర్స్​ (13 బంతుల్లో 5 ఫోర్లు, 22) పరుగులకు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత లూరీ ఈవన్స్​ కూడా 24 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పావెల్​ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్​ల సాయంతో 49 పరుగులతో మెరిసి కాస్తలో అర్ధ సెంచరీని మిస్​ అయ్యాడు. చివరకు అలిక్ 10 బంతుల్లో 1x4 సాయంతో 13* మ్యాచ్​ను ముగించాడు. ఇక సెంయిట్స్​ కిట్స్​ బౌలర్లలో కార్బిన్ బోశ్​, డొమినిక్ డ్రేక్స్​ చెరో వికెట్​ తీశారు.

అంతకుముందు టాస్​ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్ కిట్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఫ్లెచర్‌(56), విల్‌ స్మిద్‌(63), రుథర్‌ఫర్డ్‌(65*) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. జైద్​ గూలీ (22), హావెల్​ (1) పరుగులు చేశారు. బార్బడోస్​ బౌలర్లలో రఖీమ్​ రెండు వికెట్లు పడగొట్టగా, బ్రెత్​వైట్​ ఒక వికెట్ తీశాడు.

Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?

Asia Cup 2023 Venue : భారీ వర్షాల ఎఫెక్ట్​.. భారత్​-పాక్​ వాషౌట్​తో కీలక నిర్ణయం.. వేదికల్లో మార్పు!

Last Updated : Sep 4, 2023, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.