ETV Bharat / sports

'వరల్డ్​కప్​ కోసం భారత్​కు పాక్​ కచ్చితంగా వస్తుంది.. కావాలంటే రాసిస్తా' - odi world cup2023

2023లో భారత్​లో జరిగే వన్డే ప్రపంచకప్​ కోసం పాకిస్థాన్​ కచ్చితంగా వస్తుందని టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ ఆకాశ్​ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ​ రాకపోతే పాక్​ భారీగా నష్టపోతుందని తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే?

ODI World Cup India Pakisthan
ODI World Cup India Pakisthan
author img

By

Published : Oct 20, 2022, 12:09 PM IST

ODI World Cup India Pakisthan: వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌ తాము ఆడబోమంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఇరు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే బీసీసీఐ నిర్ణయం తర్వాత పీసీబీ ఒక లేఖ విడుదల చేసింది. భారత్​లో జరిగే వన్డే ప్రపంచ కప్ నుంచి తాము వైదొలగుతామని బెదిరించింది.

అయితే ఈ విషయమై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌ కోసం భారత్‌.. పాకిస్థాన్‌కు వెళ్లదని, వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు పాకిస్థాన్ మాత్రం కచ్చితంగా భారత్‌కు వస్తుందని చెప్పాడు. అందుకు తాను రాసి ఇవ్వగలనని పేర్కొన్నాడు.

"భారత్ పాల్గొనకపోతే ఆసియా కప్ జరగకపోవచ్చు. ప్రపంచకప్‌తో పోలిస్తే ఆసియాకప్ చిన్నపాటి టోర్నీ. అయితే వన్డే ప్రపంచ కప్‌ను దాటవేస్తే నష్టపోయేది పాకిస్థానే. కాబట్టి పాక్ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆసియా కప్ 2023 తటస్థ వేదికపై జరుగుతుందని నేను భావిస్తున్నాను." అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు. భారత్​ను 'ఏసీసీ పెద్ద సోదరుడు'గా పేర్కొన్న ఆకాశ్​ చోప్రా.. కౌన్సిల్‌లో డబ్బు తీసుకోని ఏకైక సభ్యుడు బీసీసీఐ మాత్రమేనని, ఇది చాలా మందికి తెలియదని చెప్పాడు.

ఇవీ చదవండి: కోహ్లీతో బ్యాటింగ్​.. పాకిస్థాన్​తో మ్యాచ్​ ఎప్పుడూ స్పెషలే: పంత్​

T20 World Cup: సూపర్​-12లోకి ఏ జట్లు వెళ్లనున్నాయో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.