ODI World Cup 2023 Spinners : ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. సొంతగడ్డపై టోర్నీ జరుగుతున్నందున ప్లేయర్ల ఎంపికలో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తున్నందున జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటిచ్చారు. అయితే ఆ ముగ్గురిలో ఒక్క కుడి చేతి వాటం ఆఫ్‌స్పిన్నరూ లేడు. కుల్‌దీప్ యాదవ్ చైనామన్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. వాళ్ల బౌలింగ్ కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్లు బంతులేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కుల్‌దీప్ ఎడమచేతి వాటంలో ఆఫ్‌స్పిన్ వేస్తాడు. దాన్నే 'చైనామన్' స్టైల్ అని అంటారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ రూపంలో సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అతను కాకుండా దేశవాళీ క్రికెట్లో పేరున్న మరో ఆఫ్‌స్పిన్నర్లు ఎవరూ కనిపించడం లేదు.
Top Spinners In Crickcet : మరోవైపు గత కొన్నేళ్లలో ఆఫ్‌స్పిన్‌కు ప్రపంచ క్రికెట్లో ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుండటం వల్ల వర్ధమాన ఆటగాళ్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లుగా మారాలనుకునే వారు లెగ్ స్పిన్‌ను ఎంచుకుంటున్నారే తప్ప.. ఆఫ్‌స్పిన్ జోలికి వెళ్లట్లేదు. కేవలం భారతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక అన్ని ప్రధాన జట్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లంతా మణికట్టును ఉపయోగించి స్పిన్ చేసేవాళ్లే. వేలితో బంతిని తిప్పేవాళ్లు చాలా అరుదు. ప్రధానంగా బ్యాటర్లుగా ఉండి పార్ట్‌టైమ్ స్పిన్ వేసే వాళ్లు మాత్రమే ఆఫ్‌స్పిన్నర్లుగా ఉంటున్నారు తప్ప ఈ కళకు ప్రత్యేకంగా ఎవరూ లేరు.
ఇక ఇంగ్లాండ్ ప్రపంచకప్ జట్టులో ఎంపికైన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ అడిల్ రషీద్ మణికట్టు బౌలర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్ట్‌టైమ్ బౌలింగ్ వేసే మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఆఫ్‌స్పిన్ వేస్తారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా లెగీనే. మరో స్పిన్నర్ అస్టాన్ అగార్ ఎడమచేతి వాటం బౌలర్. ఆ జట్టులో పార్ట్‌టైమర్‌లు అయిన మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ ఆఫ్‌స్పిన్ వేస్తారు. అయితే దక్షిణాఫ్రికా జట్టులో మాత్రం షంసి చైనామన్ బౌలర్. కేశవ్ మహరాజ్ ఎడమచేతి వాటం స్పిన్నర్. పాక్ జట్టులో షాదాబ్ ఖాన్ కూడా లెగీనే. మరో స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మాత్రం ఎడమచేతి వాటం. న్యూజిలాండ్ స్పిన్ విభాగంలో రాణిస్తున్న శాంట్నర్, రచిన్ రవీంద్ర ఎడమచేతి వాటం స్పిన్నర్లే.
మరోవైపు ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ ఓ ఆఫ్‌స్పిన్నర్. భారత దిగ్గజ బౌలర్లలో హర్భజన్ సింగ్ కుడా ఈ కోవకు చెందినవాడే. ఇక సక్లయిన్ ముస్తాక్, అశ్విన్, సయీద్ అజ్మల్, గ్రేమ్ స్వాన్ లాంటి మేటి ఆఫ్‌స్పిన్నర్ల కూడా క్రికెట్ ప్రపంచంలో రాణించినవారే. అయితే టీ20ల వల్ల ఆఫ్‌స్పిన్నర్ల హవా క్రమ క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆఫ్‌స్పిన్నర్ల మీద ఎదురు దాడి చేయడం అనేది బ్యాటర్లకు తేలికైపోయింది.
ఆఫ్‌స్పిన్నర్లు వేళ్లతో బంతిని పట్టుకునే తీరును బట్టే బ్యాటర్లు ఎలాంటి షాట్ ఆడాలో అంచనా వేసుకుంటున్నారు. బంతిని ఎంత టర్న్ చేసినప్పటికీ షాట్లు ఆడేస్తున్నారు. అందుకే టీ20ల్లో ఆఫ్‌స్పిన్నర్ బంతి అందుకుంటే బ్యాటర్లకు పండగే అన్నట్లు తయారైంది పరిస్థితి. లెగ్ స్పిన్నర్లతో పోలిస్తే ఆఫ్‌స్పిన్నర్లలో వైవిధ్యం తక్కువ కావడం వల్ల దూకుడుగా ఆడే కొత్తతరం బ్యాటర్లు వారి బౌలింగ్‌ను అలవోకగా ఆడేస్తున్నారు. అందుకే అన్ని జట్లూ ఆఫ్‌స్పిన్నర్లకు ప్రాధాన్యం తగ్గించేశాయి. కొత్తగా ఆఫ్‌స్పిన్‌ను ఎంచుకునే స్పెషలిస్టు బౌలర్లూ తగ్గిపోయారు.
-
One of the seven wonders of the world and the ICC Men's Cricket World Cup Trophy 😍#CWC23 #TajMahal pic.twitter.com/CojWBit7jp
— ICC Cricket World Cup (@cricketworldcup) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">One of the seven wonders of the world and the ICC Men's Cricket World Cup Trophy 😍#CWC23 #TajMahal pic.twitter.com/CojWBit7jp
— ICC Cricket World Cup (@cricketworldcup) August 18, 2023One of the seven wonders of the world and the ICC Men's Cricket World Cup Trophy 😍#CWC23 #TajMahal pic.twitter.com/CojWBit7jp
— ICC Cricket World Cup (@cricketworldcup) August 18, 2023
Golden Ticket World Cup 2023 : సచిన్ తెందూల్కర్‌కు 'గోల్డెన్' టికెట్.. ఏంటి దీని ప్రత్యేకత?