న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ బీజే వాట్లింగ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించనున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. యూకే వేదికగా జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మ్యాచ్‌యే తనకు చివరిదని వాట్లింగ్ తెలిపాడు. 2009లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కివీస్ ఆటగాడు.. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడాడు. కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కీలక ప్లేయర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్.
"న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం. అందులోనూ సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆడడం గౌరవంగా భావిస్తున్నా. టెస్టు కెరీర్ ఆసాంతం ఎంజాయ్ చేశాను. రానున్న రోజుల్లో ఈ సంతోషాన్ని కోల్పోతాను. గొప్ప గొప్ప ఆటగాళ్లతో కలిసి ప్రయాణం చేశాను. వీడ్కోలు ప్రకటించడానికి ఇదే సరైన సమయం."
-బీజే వాట్లింగ్, కివీస్ క్రికెటర్.
ఇదీ చదవండి: 'వెస్టిండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం.. కష్టమే!'
వాట్లింగ్ ప్రదర్శనలు..
- కీపింగ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు ఈ 35 ఏళ్ల కివీస్ ఆటగాడు. ఇప్పటివరకు 249 క్యాచ్‌లు(ఫీల్డర్‌గా 10 క్యాచ్‌లు) అందుకున్నాడు.
- టెస్టు కెరీర్లో మొత్తంగా 8 శతకాలు నమోదు చేశాడు.
- బ్రెండన్ మెక్కల్లమ్, కేన్ విలియమ్సన్‌లతో కలిసి అత్యధిక పరుగుల భాగస్వామ్యాలలో పాలు పంచుకున్నాడు.
- 2014లో భారత్‌పై మెక్కల్లమ్తో కలిసి నాలుగో వికెట్‌కు 362 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
- ఆ తర్వాతి ఏడాది శ్రీలంకపై కేన్ విలియమ్సన్తో కలిసి ఐదో వికెట్‌కు 365* పరుగులు జోడించాడు వాట్లింగ్.
- 2019 నవంబర్‌లో ఇంగ్లాండ్‌పై ఏడో వికెట్‌కు మిచెల్ శాంటర్న్తో కలిసి 261 పరుగులు సాధించాడు వాట్లింగ్.
- వికెట్ కీపర్‌గా ఉండి టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదో క్రికెటర్ వాట్లింగ్.
ఇదీ చదవండి: డ్రైవర్ తనయ.. టోక్యో విమానంలో..