New Zealand World Cup Squad 2023 : మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 15 మంది ఆటగాళ్లతో తమ జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్. ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్న కేన్ మామ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఈ మెగా ఈవెంట్ జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.
అదే విధంగా యువ ఆల్‌రౌండర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్‌కూ వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కింది. మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇక గాయం కారణంగా స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. విలియమ్సన్, డారిన్ మిచెల్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్‌తో కివీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీలతో పేస్ బలంగా ఉంది.
ICC World Cup 2023 New Zealand Team Squad : వరల్డ్‌కప్‌నకు ఎంపికైన న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్
-
Our 15 for the @cricketworldcup in India! More | https://t.co/D2jqxQxWeE #BACKTHEBLACKCAPS pic.twitter.com/wIlzA5N3qU
— BLACKCAPS (@BLACKCAPS) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our 15 for the @cricketworldcup in India! More | https://t.co/D2jqxQxWeE #BACKTHEBLACKCAPS pic.twitter.com/wIlzA5N3qU
— BLACKCAPS (@BLACKCAPS) September 10, 2023Our 15 for the @cricketworldcup in India! More | https://t.co/D2jqxQxWeE #BACKTHEBLACKCAPS pic.twitter.com/wIlzA5N3qU
— BLACKCAPS (@BLACKCAPS) September 10, 2023
అహ్మదాబాద్ వేదికగా కివీస్.. అక్టోబరు 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఇదే 2023 వరల్డ్‌కప్ సీజన్లో తొలి మ్యాచ్. 2019 వరల్డ్ కప్‌లో ఇవే జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి.. వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. కాగా.. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది.
Asia Cup 2023 Ind vs Pak : సచిన్-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్-కేఎల్ రాహుల్