ETV Bharat / sports

'సిరాజ్​ ఏం పాపం చేశాడు'.. బీసీసీఐపై నెటిజన్లు ఫుల్​ ఫైర్​! - క్రికెట్​ లేటెస్ట్​ న్యూస్​

ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్​లు ఆడేందుకు సన్నద్ధమవుతోంది టీమ్​ఇండియా. కొవిడ్ కార‌ణంగా ఈ సిరీస్‌కు ష‌మీ దూర‌మ‌వ్వగా.. అత‌డి స్థానంలో ఉమేశ్​ యాద‌వ్‌ను ఎంపిక‌చేశారు. అయితే సిరాజ్‌ను కాద‌ని ఉమేశ్​ను ఎంపిక‌చేయ‌డంపై బీసీసీఐను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

siraj khan
siraj khan
author img

By

Published : Sep 18, 2022, 5:12 PM IST

చక్కటి స్వింగ్ బౌలింగ్​తో గత రెండు, మూడేళ్లుగా మూడు ఫార్మాట్స్​లోనూ మంచి ప్రతిభను చాటుకున్నాడు పేసర్ మహ్మద్ సిరాజ్. కానీ ఐపీఎల్ 2022 సీజన్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ వెలుగులోకి రావడంతో సిరాజ్​ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. జింబాబ్వే, ఐర్లాండ్​తో పాటు పలు సిరీస్​లకు అతడిని ఎంపిక చేయలేదు. అంతేకాకుండా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్​ల‌కు కూడా సిరాజ్ పేరును కనీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.

తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​కు కొవిడ్ కార‌ణంగా పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో ఉమేశ్​ యాద‌వ్​ను ఎంపిక‌చేశారు. అయితే ఉమేశ్​ యాద‌వ్ జాతీయ జ‌ట్టుకు ఆడి చాలా కాల‌మైంది. దాదాపు రెండేళ్ల క్రితం టీమ్​ఇండియా త‌ర‌ఫున టీ20 మ్యాచ్ ఆడాడు. అనూహ్యంగా అత‌డిని ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపిక చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సిరాజ్‌ను కాద‌ని ఉమేశ్​కు స్థానం క‌ల్పించ‌డంపై నెటిజ‌న్లు.. బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. సిరాజ్‌ను కావాల‌నే ప‌క్క‌న‌పెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ష‌మీ స్థానంలో సిరాజ్ బెట‌ర్ ఆప్ష‌న్ అని సూచిస్తున్నారు. సిరాజ్ ఏం పాపం చేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: ఓపెనర్​గా కోహ్లీ కంటే అతడికే సత్తా ఎక్కువ: గౌతమ్​ గంభీర్

విరాట్ కోహ్లీ న్యూ హెయిర్​ స్టైల్​​.. ఫొటోలు వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.