Netherlands World Cup Squad 2023 : భారత్ వేదికగా మరి కొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. అక్టోబర్ 5 నుంచి షురూ అవ్వనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమ్ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా.. తమ టీమ్స్‌ను అనౌన్స్ చేశాయి. తాజాగా నెదర్లాండ్స్ కూడా తమ టీమ్ డీటెయిల్స్‌ను వెల్లడించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే తెలుగు ములాలున్న తేజ నిడమనూరుకు నెదర్లాండ్స్ వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కడం విశేషం. ఆల్‌రౌండర్ అయిన తేజ.. విజయవాడలో పుట్టాడు. అయితే అతడు నెదర్లాండ్స్ నేషనల్ టీమ్‌కు 2022 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌లో దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు.
ఇక నెదర్లాండ్స్ టీమ్ విషయానికొస్తే.. వాన్ డెర్ మెర్వే, అకెర్మాన్‌లకు తిరిగి జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో వీరిద్దరూ లేరు. జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ అదరగొట్టింది(netherlands world cup qualifiers 2023). సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఊహించని రేంజ్లో అసాధారాణ పోరాటం కనబరిచి విజయం సాధించింది. చివరి బెర్తును ఖరారు చేసుకుంది.
నెదర్లాండ్స్ వరల్డ్ కప్ ఆడటం ఇది ఐదోసారి. చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగింది. ఈ వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో పోటిపనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా (అక్టోబర్ 6న) జరగనుంది. తదుపరి నవంబర్ 11న బెంగళూరులో టీమ్ఇండియాతో తలపడనుంది.
నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్ జట్టు : స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.
Ms Dhoni US Open : టెన్నిస్ మైదానంలో ధోనీ.. పెద్ద స్టారైనా సింపుల్‌గా ఆడియెన్స్ మధ్యలోనే!