ETV Bharat / sports

T20 World Cup : నమీబియా బోణీ.. శ్రీలంకపై ఘన విజయం - namibia won world cup first match

T20 World Cup : ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ ప్రారంభమైంది. మొదటి రోజు శ్రీలంక, నమీబియా తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసిన నమీబియా జట్టు.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

T20 World Cup
T20 World Cup
author img

By

Published : Oct 16, 2022, 1:00 PM IST

Updated : Oct 16, 2022, 4:47 PM IST

T20 World Cup : ఐసీసీ మొగా టోర్నీ ప్రారంభమైంది. మొదటి రోజు గ్రూప్​ దశలో శ్రీలంక, నమీబియా తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి.. 55 పరుగుల తేడాతో లంకపై గెలిచింది నమీబియా.
మొదట టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్ల ధాటికి.. లంక బౌలర్లు చేతులెత్తేసి భారీ పరుగులు సమర్పించుకున్నారు. నమీబియా ఆటగాడు జాన్ ఫ్రిలింక్ (44) మెరిశాడు. ఇన్నింగ్స్​ ఆఖరి వరకు ఆడి రనౌట్ అయ్యాడు. ఈటన్​(20), బార్డ్(26), ఎరాస్మస్(20), స్మిత్(31) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్ ప్రమోద్​ మదుషన్ రెండు వికెట్లు తీశాడు. తీక్షణ, చమీర, కరుణరత్నే, హసరంగ ఒక్కో వికెట్​ తీశారు.

164 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన శ్రీలంక.. ఆది నుంచే అష్టకష్టాలు పడింది. శ్రీలంక బ్యాటర్లకు.. నమీబియా బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 6 పరుగులకే మొదటి వికెట్​ కోల్పోయిన శ్రీలంక.. ఆ తర్వాత గాడిలో పడలేదు. శనక (29) కొంచెం రాణించినా ఫలితం లేకపోయింది. రాజపక్స(20), ధనంజయ(12), తీక్షణ(11) ఫర్వాలేదనింపించారు. దీంతో 16 ఓవర్లకు 108 పరుగులు మాత్రమే చేసి ఆల్​ ఔట్​ అయ్యింది శ్రీలంక.

ఇవీ చదవండి : T20 World Cup: పొట్టి కప్పు సమరం షురూ.. మ్యాచ్​ లైవ్​ స్ట్రీమింగ్​ ఎక్కడంటే?

T20 World Cup: బరిలో 16 దేశాలు.. సూపర్‌ అనిపించేదెవరో?

Last Updated : Oct 16, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.