ETV Bharat / sports

విమర్శకులకు అదే నా జవాబు: సిరాజ్​ - భారత్xఇంగ్లాండ్

వికెట్లు తీసిన అనంతరం నోటిపై వేలు పెట్టుకొని కొత్త తరహాలో తాను చేసుకుంటున్న వేడుకలపై వస్తున్న విమర్శలపై స్పందించాడు టీమ్​ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్. విమర్శకులకు తాను ఈ విధంగా సమాధానం ఇస్తున్నట్టు తెలిపాడు.

Siraj
మహ్మద్​ సిరాజ్
author img

By

Published : Aug 15, 2021, 11:10 AM IST

క్రికెట్​లో వికెట్​ పడిన వెంటనే బౌలర్లు వేడుక చేసుకోవడం సహజం. ఒక్కో బౌలర్​ది ఒక్కో శైలి! తాజాగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న టేస్టుల్లో టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​​ సిరాజ్​ కొత్త స్టైల్​ని అనుసరిస్తున్నాడు. వికెట్​ తీసిన ప్రతిసారి.. బ్యాట్స్​మన్​వైపు చూస్తూ మౌనంగా వెళ్లిపోమ్మని.. పెదవులపై వేలు పెట్టుకుని సైగలు చేస్తున్నాడు. దీనిని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అంత అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉందని తాజాగా సిరాజ్​ వెల్లడించాడు.

"నేను అలా వేడుక చేసుకోవడానికి కారణం నా విమర్శకులు. నేను ఏదీ చేయలేనని, నా గురించి చాలా చెబుతుంటారు. నన్ను ద్వేషించేవారికి నా బంతితోనే సమాధానం చెబుతా. అందుకే ఈ కొత్త తరహా వేడుక."

-మహ్మద్​ సిరాజ్, టీమ్​ఇండియా బౌలర్

లార్డ్స్​లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో​ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు సిరాజ్.

ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి.. జో రూట్ అజేయ శతకం(180*)తో తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 391 పరుగులు చేసింది. దీంతో 27 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు రాహుల్​ అద్భుత శతకం(129)తో తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 364 పరుగులు చేసింది.

ఇదీ చూడండి: 'నీ బౌలింగ్​ సూపర్- స్లెడ్జింగ్​ లేకుంటే బెటర్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.