ETV Bharat / sports

IPL 2023 తర్వాత ధోనీ రిటైర్‌ అవుతాడా?.. ChatGPT ఏం చెప్పిందంటే? - టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ

ఐపీఎల్​ 16వ సీజన్​ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్​ తర్వాత చెన్నై కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే?

ms dhoni chat gpt
ms dhoni
author img

By

Published : Mar 26, 2023, 2:40 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ గుర్తించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఆటతీరుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్​ ఉన్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న ధోనీ.. కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 16 సీజన్‌ తర్వాత ధోనీ.. ఈ మెగా టోర్నీకీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై కెప్టెన్‌ కూల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మహీ అభిమానులు మాత్రం ఈ వార్తలతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని ధోనీ రిటైర్మెంట్ గురించి అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
"నా వద్ద ధోనీకి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ, అతడి వ్యక్తిగత ఆలోచనలు, ప్రణాళికలు లేవు. అందువల్ల, ధోనీ ఐపీఎల్​ 2023 తర్వాత రిటైర్ అవుతాడో లేదో నేను కచ్చితంగా అంచనా వేయలేను. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలా.. వద్దా అనేది.. అతడి ఫిట్‌నెస్, ఫామ్, క్రికెట్‌లో ఇంకా కొనసాగాలనే ఆసక్తి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే అతడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అని గమనించాలి. వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలి" అని చాట్‌జీపీటీ ఆసక్తికరంగా సమాధానమిచ్చింది.

"ధోనీ రిటైర్మెంట్ భారత క్రికెట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ధోనీ భారతదేశంలోని చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి. అతడి రిటైర్మెంట్ జట్టు నాయకత్వంలో శూన్యతను కలిగిస్తుంది. ఈ అంశంలో నేను కచ్చితమైన సమాధానం ఇవ్వలేను. కానీ, ఈ సమాచారం మీరు ఓ అంచనాకు రావడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా" అని చాట్‌జీపీటీ వెల్లడించింది.

మరోవైపు, ఈ సీజన్​ కోసం కసరత్తులు ప్రారంభించాడు. నెట్స్​తో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ధోనీ ప్రాక్టీస్​ చూసిన అభిమానులు సర్​ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే అతడు ఈ సారి ప్రాక్టీస్ సెషన్​లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో అతడు ఈ సీజన్​లో బౌలింగ్‌ కూడా చేయబోతున్నాడా అనే అనుమానం ఫ్యాన్స్​లో కలుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్​ ఫ్రాంఛైజీ తన సోషల్​మీడియా ఇన్‌స్టాగ్రామ్​ అకౌంట్​లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఫ్యాన్స్​ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు లైక్స్​, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.