టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటే ఈ ఇతడు ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే గ్రౌండ్లో వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ పరుగుల వరద పారిస్తాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా ఈజీగా మలుస్తుంటాడు. అలా మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎంతో మంది దిగ్గజ ప్లేయర్స్‌తో పిచ్‌ను కూడా షేర్ చేసుకున్నాడు. అయితే తాజాగా విరాట్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'వేగంగా సింగిల్స్' ఎవరు తీస్తారు..? అనే విషయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్-కోహ్లీ మధ్య చర్చ జరిగింది. దీనికి విరాట్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ పేరు ఏంటో తెలుసా? ధోనీ కాదు. ఏబీడీ.
"ఈ ప్రశ్న నాకు గతంలోనూ ఎదురైంది. వికెట్ల మధ్య నాతో అత్యంత వేగంగా పరుగెత్తే ప్లేయర్ ఏబీ డివిలియర్స్. అయితే అతడితో పాటు వికెట్ల మధ్య ఎంతో సహకారాన్ని అందించే మరో ప్లేయర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. వారిద్దరు ఎంత వేగంగా పరుగెత్తుతారో అస్సలు నాకు తెలియదు. కానీ.. వారిద్దరితో కలిసి ఆడితే.. రన్ కోసం వారిని పిలవాల్సిన అవసరమే నాకు ఉండదు" అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రశ్నను ఏబీడీని అడగగా.. అతడు మాత్రం డుప్లెసిస్ పేరు పేర్కొన్నాడు.
ఇక విరాట్‌కు మరో ప్రశ్న కూడా ఎదురైంది. 'వికెట్ల మధ్య అత్యంత స్లోగా పరుగెత్తే బ్యాటర్ ఎవరు..?' అని అడగగా... దానికి తనదైన స్టైల్లో బదులిచ్చాడు. ఇది కాంట్రవర్సీ ప్రశ్న అని అంటూనే పుజారా పేరును సరదాగా నవ్వుతూ తెలిపాడు. 2018లో సెంచూరియన్ టెస్టును గుర్తుచేసుకుంటూ.. రెండు ఇన్నింగ్స్‌లో పుజారా రనౌట్ అయ్యాడని.. అప్పుడు అతడు పరుగెత్తిన విధానాన్ని వివరించాడు. కాగా, ప్రస్తుతం విరాట్ ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌కు ముందుకు మరోసారి తనదైన స్టైల్లో గ్రౌండ్లో చిందులేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. తాజాగా చెపాక్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో బౌండరీ రోప్ వద్ద 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్ పాటకు చిందులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.
- — javed ansari (@javedan00643948) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— javed ansari (@javedan00643948) March 22, 2023
">— javed ansari (@javedan00643948) March 22, 2023
ఇదీ చూడండి: నెం.1 ర్యాంకును కోల్పోయిన సిరాజ్.. గ్రౌండ్‌లోనే మండిపడ్డ రోహిత్, కోహ్లీ!