MS Dhoni 2011 Bat Price : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే అతడు సాధించిన ఘనతలు అంత ప్రత్యేకమైనవి. అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. అలా ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ చరిత్రకెక్కాడు.
MS Dhoni 2011 World Cup Bat Price : అయితే 2011 వన్డే వరల్డ్ కప్ తుది పోరులో మహీ ఆడిన ఇన్నింగ్స్‌ను ఏ క్రికెట్ అభిమాని మర్చిపోలేరు. ముఖ్యంగా మహీ కొట్టిన విన్నింగ్ షాట్ అయితే ఇప్పటికే ప్రతి క్రికెట్ అభిమాని కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. అలానే 'ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇంటు ది క్రౌడ్!! ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్. ది పార్టీ బిగిన్స్ ఇన్ డ్రెస్సింగ్ రూమ్' అంటూ మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి చెప్పిన కామెంట్స్ కూడా ఇప్పటికీ అందరికీ అలానే గుర్తుంటుంది.
MS Dhoni Score in World Cup 2011 final : అయితే ధోనీ బాదిన ఆ విన్నింగ్ షాట్‌కు.. యావత్ భారత్ క్రికెట్ అభిమానులు భావోద్వేగంతో ఉప్పొంగిపోయారు. ఆ మ్యాచ్‌లో మహీ 91 నాటౌట్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అతడిని వరల్డ్ బెస్ట్ కెప్టెన్‌గా నిలబెట్టింది. అయితే ఆ మ్యాచ్‌లో ధోనీ వినియోగించిన బ్యాట్ ఓ ఘనతను అందుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
MS Dhoni 2011 World Cup Winning Shot : లండన్‌లోని ఓ ఛారిటీ ఈవెంట్‌లో మహీ బ్యాట్‌ను వేలం వేశారు. ఆ బ్యాట్ ఏకంగా అక్షరాల రూ.83 లక్షలు పలికింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్(ఇండియా) కంపెనీ.. అంత మొత్తం ధర చెల్లించి మరీ మహీ బ్యాట్‌ను దక్కించుకుంది. రూ. 83 లక్షలు పలికిన ఈ బ్యాట్.. వరల్డ్‌లోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా నిలిచిపోయింది. ఈ భారీ మొత్తాన్ని మహీ భార్య సాక్షి ఆధ్వర్యంలోని ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనుంది.
Dhoni LGM movie review : ధోనీ ఫస్ట్ మూవీ రివ్యూ.. యోగిబాబే కాపాడాలి!
కళ్లు చెదిరే బైక్ కలెక్షన్స్.. 'ఎందుకు మహీ..?' అంటూ సాక్షి..