టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి(Mohammed Shami) ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. అతడి భార్య హసీన్ జహాన్, విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్మీడియాలో చురుగ్గా ఉంటూ తరచుగా షమిపై ఆరోపణలు చేసే ఈమె.. మరోసారి అతడిని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది! "నేను పంజరంలో బంధించబడ్డ రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆకాశంలో ఎగరడానికి రెక్కలు ఉన్నాయి." అని వ్యాఖ్య జోడిస్తూ తనకు సంబంధించిన ఓ తెల్లచీర ఫొటోను పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్గా మారింది.
దీనిపై స్పందించిన నెటిజన్లు.. షమిని ఉద్దేశిస్తూ హసీన్ ఈ కామెంట్ చేసిందని విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అందంగా ఉందంటూ ఆమె ఫొటోకు లైక్లు కూడా కొడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
షమి, హసీన్.. ప్రేమించుకుని 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత కొనాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2018 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన భర్త, అతడి కుటుంబంపై గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టింది హసీన్. కానీ వీరిద్దరు ఇప్పటివరకు విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె మోడలింగ్ చేస్తోంది. తరచుగా తన హాట్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ చురుగ్గా ఉంటోంది.
ఇదీ చూడండి: షమీ భార్యకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశం