ETV Bharat / sports

అది నా వల్ల సాధారణ విషయంగా మారింది: మిథాలీ - మిథాలీరాజ్​ ఆటకు వీడ్కోలు

Mitahli Raj: భారత జట్టులో యస్తిక భాటియా, రిచా ఘోష్‌, షెఫాలీ వర్మలకు మంచి భవిష్యత్తుందని చెప్పింది భారత క్రికెట్​ దిగ్గజం మిథాలీ రాజ్. బాలికలు వీధుల్లో ఆడడం, అకాడమీల్లో చేరడమనేది తన వల్ల చాలా సాధారణ విషయంగా మారి ఉంటుందని​ అన్నది.

mithali raj retirement
మిథాలీ రాజ్​ రిటైర్మెంట్​
author img

By

Published : Jun 16, 2022, 8:20 AM IST

Mitahli Raj: బాలికలు వీధుల్లో ఆడడం, అకాడమీల్లో చేరడమనేది తన వల్ల చాలా సాధారణ విషయంగా మారి ఉంటుందని క్రికెట్‌ దిగ్గజం, భారత మహిళల మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతూ ఆమె ఇటీవలే క్రికెట్‌ నుంచి రిటైరైన సంగతి తెలిసిందే. లక్షలాది అమ్మాయిలకు ఆమె ప్రేరణగా నిలిచింది. మీరు వారసత్వంగా వదిలిన గొప్ప అంశం ఏంటి అన్న ప్రశ్నకు మిథాలీ స్పందిస్తూ.. "ఈ ప్రశ్న నన్ను చాలాసార్లు అడిగారు. ఎప్పుడూ మంచి జవాబివ్వలేకపోయా. బహుశా.. ఆడపిల్లలు వీధుల్లో క్రికెట్‌ ఆడడం, అకాడమీల్లో చేరడాన్ని నేను సాధారణ విషయంగా మార్చి ఉంటా. నేను క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టినప్పుడు అది మామూలు విషయం కాదు. ‘మేం అకాడమీల్లో అమ్మాయిలను చేర్చుకోం. మరెక్కడికైనా తీసుకెళ్లండి’ అనే వాళ్లు" అని చెప్పింది.

"ఇప్పుడైతే బాలురకు మాత్రమే అన్న అకాడమీలే లేవు. ఏ అకాడమీ కూడా బాలికలను చేర్చుకోవడానికి నిరాకరించట్లేదు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది" అని మిథాలీ అంది. ఇప్పుడున్న మహిళా క్రికెటర్లలో భారత్‌కు దీర్ఘకాలం ఆడేలా కనిపిస్తున్నది ఎవరని అడగగా.. "కిరణ్‌ నవ్‌గిరే ఆసక్తి కలిగిస్తోంది. దేశవాళీ టీ20, మహిళల ఛాలెంజ్‌లో ఆమె మెరుగ్గా రాణించింది. భారత జట్టులో యస్తిక భాటియా, రిచా ఘోష్‌, షెఫాలీ వర్మలకు మంచి భవిష్యత్తుంది. ఎస్‌.మేఘనకు కొన్ని అవకాశాలే వచ్చినా మెరుగైన ప్రదర్శన చేసింది" అని చెప్పింది.

ఇదీ చూడండి: టీమ్ఇండియా కెప్టెన్​గా హార్దిక్ పాండ్య.. టీంలోకి త్రిపాఠి ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.