టీమ్‌ఇండియా వన్డే జట్టులోకి తిరిగొచ్చిన స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు ముందున్నదంతా కఠిన మార్గమేనని మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగడం కుల్‌దీప్‌కు కష్టంగా మారుతుందని తెలిపాడు.
నిరుడు సెప్టెంబరులో ఐపీఎల్ సందర్భంగా గాయపడిన కుల్‌దీప్.. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టులో చోటు సంపాదించాడు.
"కుల్‌దీప్ ముందున్నదంతా కఠినమైన మార్గం. గత కొంతకాలంగా అతను దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం అంత సులువు కాదు. మోకాలి శస్త్రచికిత్సకు ముందు కూడా అతను క్రమం తప్పకుండా ఆడలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేస్తున్నప్పుడు మెదడులో వచ్చే మొదటి ఆలోచన.. నా బౌలింగ్‌లో బాదకూడదు అనే. ఇది మానసిక దృఢత్వానికి పరీక్ష" అని భజ్జీ చెప్పాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: