Krishnappa Gowtham: అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాళ్లలో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచాడు అవేశ్ ఖాన్. ఇతడిని లఖ్‌నవూ.. ఐపీఎల్ మెగావేలం తొలిరోజు రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది.
అయితే అంతకుముందు ఈ రికార్డు కృష్ణప్ప గౌతమ్ పేరిట ఉండేది. ఈ ఆల్‌రౌండర్‌ను గతేడాది మినీవేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈసారి అంతా తలకిందులైంది.
అప్పుడు రూ. 9 కోట్లకుపైనే పెట్టిన ఫ్రాంఛైజీలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కృష్ణప్ప.. రూ. 90 లక్షలకే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సొంతమయ్యాడు. రూ. 50 లక్షల బేస్‌ప్రైజ్‌కు వేలంలోకి వచ్చిన గౌతమ్ కోసం కోల్‌కతా, దిల్లీ కూడా పోటీపడినా.. లఖ్‌నవూ దక్కించుకుంది.
2021లో ప్యాట్ కమిన్స్‌ను రూ. 15.50 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్న కోల్‌కతా.. ఈసారి రూ. 7.25 కోట్లకే సొంతం చేసుకుంది. ఇతడి ధర కూడా సగానికిపైగా తగ్గింది.
వారు మాత్రం..
ఇతడి పరిస్థితి ఇలా ఉంటే.. గతేడాది లక్షల్లో తీసుకున్న కొందరు ప్లేయర్ల గతి తిరిగింది. అవేశ్ ఖాన్.. గత సీజన్లో రూ. 70 లక్షలకే దిల్లీకి ఆడాడు. ఇప్పుడు లఖ్‌నవూ రూ. 10 కోట్లకు కొనుక్కుంది.
- 2021లో ఆర్సీబీకి రూ. 20 లక్షలకే ఆడిన హర్షల్ పటేల్.. అదే జట్టుకు ఇప్పుడు రూ. 10.75 కోట్లకు అమ్ముడుపోయాడు.
- రూ. 75 లక్షలకే రాయల్స్‌కు ఆడిన లివింగ్ స్టోన్‌ను ఈసారి రూ. 11.50 కోట్లకు దక్కించుకుంది పంజాబ్.
- రూ. 80 లక్షలకు చెన్నైకి ఆడిన దీపక్ చాహర్‌ను.. ఈసారి అదే జట్టు రూ. 14 కోట్లకు వేలం పాడి సొంతం చేసుకుంది.
ఇంకా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు.
ఇవీ చూడండి: 'రాహుల్స్' దశ తిరిగింది- వేలంలో కోట్లకు కోట్లు..!