Kohli Test Captaincy race: టీమ్ఇండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో బీసీసీఐ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే విషయం క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాగా, ఈ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ ముందు కొత్త సవాలు వచ్చి పడినట్లైంది. ఎందుకంటే త్వరలోనే శ్రీలంకకు టెస్టు సిరీస్‌ను ఆతిథ్యమివ్వనుంది భారత్. దీంతో ఈలోపే కొత్త బాధ్యతల్ని మరొక ఆటగాడికి అప్పగించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ కెప్టెన్సీ రేసులో పలువురు ఆటగాళ్ల పేర్లు వినపడుతున్నాయి. మరి వారెవరంటే..
రోహిత్ శర్మ(Rohith sharma test captaincy race)
ప్రస్తుతం వన్డే, టీ20ల్లో రోహిత్‌శర్మకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీంతో టెస్టు జట్టుకు కూడా హిట్‌మ్యాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేఎల్ రాహుల్(Kl rahul test captaincy race)
టెస్టు కెప్టెన్ పదవికి రోహిత్ శర్మ తర్వాత రేసులో ఉన్నది కేఎల్ రాహులే. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు కోహ్లీ, రోహిత్ దూరమైన నేపథ్యంలో అతడే జట్టును ముందుండి నడింపించాడు. అతడికి ఐపీఎల్‌లోనూ సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. కాబట్టి అతడికి పగ్గాలు అప్పగింటే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిషబ్ పంత్(rishab patn Test Captaincy race)
దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే యువక్రికెటర్ రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న వయసులోనే బాధ్యతలు అప్పగించడం ద్వారా భవిష్యత్తులో సారథిగా అతడు కీలక పాత్ర పోషిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అతడు ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బుమ్రా(Bumrah test captaincy race)
ఈ రేసులో బౌలర్ బుమ్రా పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు అతడు వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
మరి వీరిలో బీసీసీఐ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందో తెలియాలంటే.. బోర్డు అధికార ప్రకటన చేసే వరకు వేచి ఉంటాల్సిందే.
ఇదీ చూడండి: ఈ బల్లెం భామను చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే!