ETV Bharat / sports

Kohli Centuries : కింగ్ కోహ్లీ ఎప్పుడూ నెం.1.. ఏడాది కాలంలో 7 రికార్డ్ సెంచరీలు - భారత్ పాక్ మ్యాచ్ కోహ్లీ రికార్డ్​​ సెంచరీలు

Kohli Centuries In 2023 : ఆసియా కప్​లో భాగంలో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ రికార్డ్ సెంచరీ బాదాడు. అయితే ఈ ఫీట్​తో పలు రికార్డులను తన ఖాతాలే వేసుకున్నాడు. ఆ వివరాలు..

Kohli Centuries : నెం.1 కింగ్ కోహ్లీ.. ఏడాది కాలంలో 7 రికార్డ్ సెంచరీలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 8:37 PM IST

Kohli Centuries In 2023 : ప్రపంచ క్రికెట్​లో కోహ్లీ పేరు ఎప్పుడు సంచలనమే. ఎన్నో అద్భుతమైన రికార్డులను అందుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బ్రేక్​ చేశాడు. ఎన్నో ఘనతలతో దశాబ్ద కాలం పాటు మకుటం లేని మారాజుగా కొనసాగిన అతడు కూడా కెరీర్​లో బ్యాడ్​ ఫేస్​ను ఎదుర్కొన్నాడు. సెంచరీల కింగ్​ అనే ట్యాగ్​ లైన్​ ఎప్పుడూ మెడలో వేసుకుని తిరిగే అతడు.. దాదాపు మూడేళ్ల పాటు శతకం బాదడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆఖరికి కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కానీ అవేమీ అతడిని ఏం చేయలేకపోయాయి. విరాట్​ తన ఆత్మస్థైర్యాన్ని అస్సలు కోల్పోలేదు. ఓపిగ్గా అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. 2019-2022 వరకు తనను వెంటాడిన బ్యాడ్‌టైమ్‌ను మళ్లీ బ్యాట్‌తోనే గట్టి సమాధానం చెప్పాడు.

2022 ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్​లో ఆఫ్ఘానిస్థాన్​పై సెంచరీ బాది మునపటి ఫామ్​ను అందుకున్నాడు. కోహ్లీకి అది అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకం కావడం విశేషం. ఇక మళ్లీ మొదలు. రన్​ మెషీన్​ అంటూ పరుగుల వరద పారించడం మొదలు పెట్టాడు. వరుసపెట్టి సెంచరీల మోత మోగిస్తూ దుసుకెళ్తున్నాడు. అప్ఘానిస్థాన్​పై సెంచరీ బాదిన తర్వాత అదే ఏడాది బంగ్లాదేశ్‌పై కూడా వన్డేలో ఓ శతకం, ఈ ఏడాది(2023) స్వదేశంలో శ్రీలంకపై వన్డేల్లో రెండు శతకాలు, అనంతరం మళ్లీ స్వదేశంలో జరిగిన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సెంచరీ, ఆ తర్వాత వెస్టిండీస్​ పర్యటనలో మరో టెస్ట్‌ సెంచరీ, ఇప్పుడు తాజాగా పాకిస్థాన్​పై ఆసియా కప్‌లో రికార్డు సెంచరీ.. ఇలా వరుస పెటి​ శతకాలు బాదుతూ వస్తున్నాడు.

Asia cup 2023 IND VS PAK Kohli Century : ఈ తాజా సెంచరీతో అతడు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో 77వ శతకం కావడం విశేషం. వన్డేలో 13000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి 47వ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా 267 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచరీల మార్క్​ను అందుకున్నాడు. కొలొంబోలో వరుసగా ఇది అతడి నాలుగో శతకం. నిజానికి కోహ్లీ తన బ్యాడ్​ టైమ్​లోనూ సెంచరీ మాత్రమే చేయలేదు. హాఫ్ సెంచరీలు బాగానే చేశాడు. మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.