Rohit Sharma Kohli: టీమ్ఇండియా మాజీ సారథి కోహ్లీకు మద్దతుగా నిలిచాడు కెప్టెన్ రోహిత్‌శర్మ. విరాట్ ఫామ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడికి అండగా నిలిచాడు. టీ20 సిరీస్ ప్రారంభమయ్యే ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడాడు. కోహ్లీ ఫామ్‌పై పదే పదే అనుమానాలు లేవనెత్తుతున్న మీడియాపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు.
"కోహ్లీ ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. అతడు కచ్చితంగా రాణిస్తాడు. మీడియాలో వచ్చే అనవసర వార్తల వల్లే అతడి ఫామ్‌పై లేనిపోని చర్చలు జరుగుతున్నాయి. మీరు (మీడియా) కొన్నాళ్లు మౌనంగా ఉంటే.. అంతా సర్దుకుంటుంది. కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి చాలా అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అతడికి బాగా తెలుసు"
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ నమోదు చేసి రెండేళ్లకు పైగా అవుతోంది.
ఇదీ చూడండి: ఐపీఎల్లో జాక్‌పాట్ కొట్టిన ప్లేయర్‌కు కరోనా!