Rohit Sharma: టీమ్ఇండియాలో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్‌లను భవిష్యత్తు కెప్టెన్లుగా చూస్తున్నట్లు తెలిపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. శ్రీలంక పర్యటన నేపథ్యంలో గతవారమే టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు 34 ఏళ్ల రోహిత్. అయితే భవిష్యత్తు సారథులను ఇప్పటి నుంచే అతడు తీర్చిదిద్దాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో బుధవారం వర్చువల్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు రోహిత్.
"బుమ్రా, కేఎల్ రాహుల్, పంత్.. టీమ్ఇండియా విజయపథంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. వారిని భవిష్యత్తు నాయకులుగా పరిగణిస్తున్నాం. తమపై ఉన్న బాధ్యత గురించి వారికి తెలుసు. అయితే వారిపై ఇప్పుడే ఎలాంటి ఒత్తిడి చేయదలచుకోలేదు. వారు ఆటను ఆస్వాదిస్తూ, నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరుకుంటున్నాం."
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
అది సహజమైన ప్రక్రియ..
రాహుల్, బుమ్రా, పంత్‌లకు ప్రతి విషయాన్ని చెప్పాలనుకోవడం లేదని రోహిత్ అన్నాడు. "వారు తగినంత పరిణతి చెందారు. అవసరమైన సమయంలో వారిని గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటా. ప్రతిఒక్కరినీ ఎవరో ఒకరు తీర్చిదిద్దాలి. అలాగే నేనూ ఈ స్థాయికి వచ్చాను. ఇది సహజమైన ప్రక్రియ. అందరికీ ఇది వర్తిస్తుంది"
అది ముఖ్యం కాదు..
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా నియామకం కావడంపైనా స్పందించాడు రోహిత్. వైస్ కెప్టెన్.. బౌలర్ బ్యాటర్ అనేది ముఖ్యం కాదని అన్నాడు. అది బుద్ధిపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఆట గురించి బుమ్రాకు గొప్ప అవగాహన ఉందన్నాడు. ఆటను బుమ్రా మరో స్థాయికి తీసుకెళ్లాడని, దానిని మరింత కొనసాగిస్తాడనే నమ్మకముందని చెప్పాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు గాయాల కారణంగా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ దూరమయ్యారు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్లకు విశ్రాంతినిచ్చారు. టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. ఫిబ్రవరి 24న తొలి మ్యాచ్ జరగనుంది.
ఇదీ చూడండి: Rohit Sharma: ఆ ఫీలింగ్ గొప్పగా ఉంది: రోహిత్ శర్మ