ETV Bharat / sports

ఇంగ్లాండ్​ పర్యటనకు కేఎల్​ రాహుల్​! - kl rahul updates

శస్త్రచికిత్స చేయించుకున్న టీమ్​ఇండియా ఆటగాడు కేఎల్​ రాహుల్ త్వరగా కోలుకుంటున్నాడు. ఈ స్ట్రోక్​ ప్లేయర్​ ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్తాడని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అక్కడే సాధన చేస్తాడని వారు తెలిపారు. ​

kl rahul
కేఎల్​ రాహుల్
author img

By

Published : May 25, 2021, 10:23 AM IST

టీమ్‌ఇండియాకు శుభవార్త! స్ట్రోక్‌ ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌ వేగంగా కోలుకుంటున్నాడు. జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్స్‌కు ఇంకా నెల రోజుల గడువు ఉండటం వల్ల అక్కడికెళ్లాక రాహుల్ సాధన చేస్తాడని తెలుస్తోంది.

"రాహుల్‌ చాలా బాగున్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్తాడు అని అతడి సన్నిహిత వర్గాలు మీడియాకు చెప్పాయి. న్యూజిలాండ్‌తో ఫైనల్స్‌కు దాదాపుగా నెల రోజుల సమయం ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ సిరీస్‌ మొదలయ్యేందుకు ఒకటిన్నర నెల ఉంటుంది. గతంలోనూ టీమ్ఇండియా ఇలా చేసింది. గాయపడ్డ వృద్ధిమాన్‌ సాహాను ఆస్ట్రేలియా తీసుకెళ్లింది. అతనక్కడే కోలుకొని సాధన చేశాడు."

-రాహుల్​ సన్నిహిత వర్గాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతుండగా కేఎల్‌ రాహుల్‌కు అపెండిసైటిస్​ రావడం వల్ల శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే కరోనా కారణంగా లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. అదే సమయంలో ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. రాహుల్‌ను ఎంపిక చేసినప్పటికీ ఫిట్‌నెస్ నిరూపించుకొంటేనే వెళ్తాడని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి చాలా బాధగా ఉంది:కే ఎల్ రాహుల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.