Kapil Dev Birthday: టీమ్ఇండియా దిగ్గజం కపిల్దేవ్పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. కపిల్ అత్యుత్తమ క్రికెటర్ అనికొనియాడాడు. లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ 63వ పుట్టినరోజు సందర్భంగా భారత జట్టు జోహన్నెస్‌బర్గ్ టెస్టు గెలిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్ఇండియా ప్రస్తుత జట్టులోను కపిల్‌ను ఆదరించేవారు చాలా మంది ఉన్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు గెలిస్తే టీమ్ఇండియా కపిల్‌కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది."
--సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా నెగ్గలేదని గావస్కర్ గుర్తుచేశాడు. 2018 వన్డే సిరీస్ గెలిచినా టెస్టు సిరీస్ 2-1తో ఓడిపోయిందని అన్నాడు. ఈ నేపథ్యంలో సిరీస్ గెలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించాడు.
లిటిల్ మాస్టర్ విషెస్..
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సచిన్ తెందూల్కర్.. కపిల్ దేవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు.
-
Many happy returns of the day Kapil paaji. Wish you the best of health and a great year ahead. pic.twitter.com/ukfIogiB1N
— Sachin Tendulkar (@sachin_rt) January 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Many happy returns of the day Kapil paaji. Wish you the best of health and a great year ahead. pic.twitter.com/ukfIogiB1N
— Sachin Tendulkar (@sachin_rt) January 6, 2022Many happy returns of the day Kapil paaji. Wish you the best of health and a great year ahead. pic.twitter.com/ukfIogiB1N
— Sachin Tendulkar (@sachin_rt) January 6, 2022
బెస్ట్ ఆల్‌రౌండర్..
కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ఇండియా ప్రపంచకప్(1983) గెలిచిన సందర్భాన్ని గుర్తుచేస్తూ లెజెండరీ ఆల్‌రౌండర్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. 356 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కపిల్ 9,031 పరుగులు చేశాడని, 687 వికెట్లు తీశాడని గుర్తు చేసింది.
-
356 international matches 👍
— BCCI (@BCCI) January 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
9,031 international runs 💪
687 international wickets ☝️
Here's wishing @therealkapildev - #TeamIndia's 1983 World Cup-winning captain & one of the best all-rounders to have ever played the game - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/Po4wYtvByl
">356 international matches 👍
— BCCI (@BCCI) January 6, 2022
9,031 international runs 💪
687 international wickets ☝️
Here's wishing @therealkapildev - #TeamIndia's 1983 World Cup-winning captain & one of the best all-rounders to have ever played the game - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/Po4wYtvByl356 international matches 👍
— BCCI (@BCCI) January 6, 2022
9,031 international runs 💪
687 international wickets ☝️
Here's wishing @therealkapildev - #TeamIndia's 1983 World Cup-winning captain & one of the best all-rounders to have ever played the game - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/Po4wYtvByl
వర్షం ఆటంకం..
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భోజన విరామం కూడా కాస్త ముందుగానే ప్రకటించారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్‌పై విజయం సాధించడానికి ప్రోటీస్ జట్టు ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాండర్ డసెన్(11) ఉన్నారు.
ఇదీ చదవండి:
IND Vs SA: పంత్‌పై గంభీర్ ఫైర్
IND vs SA: 'హార్దిక్ లేని లోటును శార్దూల్ భర్తీ చేస్తున్నాడు'