Irfan Pathan Suggestions For 2nd Test: సౌతాఫ్రికాతో జరగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమ్ఇండియా నెట్స్‌లో శ్రమిస్తోంది. తొలి మ్యాచ్‌లో ప్రతీకారానికి బదులుగా సఫారీ గడ్డపై విజయం నమోదు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
కేప్‌టౌన్ వేదికగా జనవరి 3న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండు కీలక మార్పులతో బరిలోకి దిగితే బాగుంటుందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. రీసెంట్గా స్టార్‌స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్‌తో మాట్లాడిన ఇర్ఫాన్ ఈ కామెంట్స్ చేశాడు. ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్లేస్‌లో రవీంద్ర జడేజాను, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని ముకేశ్ కుమార్‌తో రీప్లేస్ చేయాలని సలహా ఇచ్చాడు. 'జడేజా ఫిట్‌గా ఉంటే అతడ్ని బరిలోకి దింపడం మంచిది. అశ్విన్ కూడా మంచి ప్లేయరే. తొలి టెస్టులో ఫ్లాట్ పిచ్‌లపై అతడు మెరుగైన ప్రదర్శననే చేశాడు. కానీ, 7వ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్ తప్పుతుంది. జడేజా ఉంటే ఆ స్థానాన్ని బ్యాలెన్స్ చేయగలడుకెప్టెన్ రోహిత్ శర్మ అదే పేస్ బౌలింగ్‌తో బరిలోకి దిగాలనుకుంటే మంచిదే. ఒకవేళ మార్పులు చేస్తే, ప్రసిద్ధ్ స్థానంలో ముకేశ్ కుమార్‌ను ఎంచుకోవడం ఉత్తమం. కానీ, నెట్స్‌లో ప్రసిద్ధ్ ప్రాక్టీస్ సంతృప్తిగా ఉంటే అతడ్ని రెండో టెస్టులోనూ కొనసాగించవచ్చు' అని ఇర్ఫాన్ అన్నాడు.
Ind vs Sa 1st Test: సౌతాఫ్రికా పర్యటనలో భారత్ తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 245-10 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 408-10 భారీ స్కోర్ చేసింది. దీంతో 163 పరుగుల ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 131 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఇక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో సౌతాఫ్రికా లీడ్‌లో కొనసాగుతోంది.
2వ టెస్టుకు భారత్ టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరణ్, ఆవేశ్ ఖాన్.
'అందుకే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది' - టెస్ట్ రిజల్ట్‌పై క్రికెట్ గాడ్ రివ్యూ!