ETV Bharat / sports

ఈ ప్రదర్శన అలవాటు చేసుకోండి: షారుక్

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో పరాజయం పాలైంది కోల్​కతా నైట్​రైడర్స్. దీనిపై స్పందించిన కేకేఆర్ యజమాని షారుక్​ ఖాన్​ ఆటగాళ్ల పోరాట పటిమను మెచ్చుకున్నాడు.

KKR
కేకేఆర్
author img

By

Published : Apr 22, 2021, 3:38 PM IST

బుధవారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన పోరు రసవత్తరంగా సాగింది. చివరకు ధోనీసేన 18 పరుగుల తేడాతో కోల్‌కతాను మట్టికరిపించింది. అయితే ఈ మ్యాచ్​లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శించిన పోరాట పటిమను ఆ జట్టు సహ యాజమాని షారూక్‌ఖాన్‌ ప్రశంసించాడు. ముఖ్యంగా రసెల్, దినేశ్ కార్తీక్, కమిన్స్‌లు పోరాడిన తీరును మెచ్చుకున్నాడు.

"ఈ రోజు రాత్రి మనం ఓడిపోయి ఉండొచ్చు. మీరు (కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌) పవర్‌ ప్లేలో మినహాయిస్తే అద్భుతంగా ఆడారు. వెల్ డన్‌ బాయ్స్‌.. రసెల్, కమిన్స్‌, దినేశ్ కార్తీక్ ఇలాంటి మంచి ప్రదర్శనలు ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకోండి. మేము తిరిగి వస్తాము."

-షారుక్ ఖాన్, కేకేఆర్ యజమాని’

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. డుప్లెసిస్ (95‌; 60 బంతుల్లో), రుతురాజ్ గైక్వాడ్ (64; 42 బంతుల్లో) ఆకట్టుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. దీపక్‌ చాహర్‌(4/29) అద్భుతమైన బౌలింగ్ చేయడం వల్ల 5.2 ఓవర్లకే మోర్గాన్‌ సేన 31 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత రసెల్(54; 22 బంతుల్లో 3×4, 6×6), దినేశ్ కార్తీక్‌(40: 24 బంతుల్లో), కమిన్స్‌(66; 34 బంతుల్లో 4×4,6×6) విధ్వంసం సృష్టించారు. అయినా కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. 19.1 ఓవర్ల వద్ద 202 పరుగులకు ఆలౌటైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.