ETV Bharat / sports

'ధోనీ నుంచి అది దొంగిలిస్తా.. నా ఆల్​టైమ్​ ఐపీఎల్​ ఫేవరెట్​ ప్లేయర్​ అతడే' - kohli on dhoni

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్​ స్టార్​ బ్యాటర్ విరాట్​ కోహ్లీ.. ఐపీఎల్​లో తన ఆల్​ టైమ్​ ఫేవరెట్​ ప్లేయర్​ ఎవరు? ఫేవరెట్​ ప్రత్యర్థి జట్టు ఏది? ధోనీ నుంచి తాను ఏం దొంగలించాలి, అప్పుగా దేన్ని తీసుకోవాలి? ఏం నేర్చుకోవాలి? అనుకుంటున్నాడో చెప్పాడు. ఆ వివరాలు..

kohli on his all time fev
kohli on his all time fev
author img

By

Published : Apr 20, 2023, 5:29 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​.. ప్రపంచంలోనే అత్యంత పేరొందిన క్రికెట్​ లీగ్​. పదహారేళ్లుగా సాగుతోన్న ఈ లీగ్​లో ఎందరో టాప్​ క్రికెటర్లు పాల్గొని అభిమానులను ఆకట్టుకున్నారు. వారందరికీ ఈ లీగ్​లో కొన్ని మధుర జ్ఞాపకాలు, మర్చిపోలేని సంగతులు, ఫేవరెట్ ప్లేయర్స్​.. ఇలా ఎన్నో ఉంటాయి. అయితే అలాంటివే తనకు కూడా ఉన్నాయని అన్నాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్​ కోహ్లీ. తనకు ఇష్టమైన ఆటగాళ్ల గురించి కూడా ఐపీఎల్ బ్రాడ్​కాస్టర్​ జియో టీవీతో పంచుకున్నాడు. ఐపీఎల్​ ఎంతో మంది ఉత్తమ ఆటగాళ్లను అందించిందని చెప్పాడు. అలాగే సీఎస్కే కెప్టెన్​ ధోనీ గురించి కూడా మాట్లాడాడు.

ఐపీఎల్​లో తన గ్రేటెస్ట్​ ఆఫ్ ఆల్ టైమ్ ఫేవరెట్​ ఎవరు అని కోహ్లీని అడగగా.. మరో ఆలోచన లేకుండా ఏబీ డివిలియర్స్​, లసిత్ మలింగల పేర్లు చెప్పాడు. అయితే డివిలియర్స్​తో తన అనుబంధాన్ని గురించి విరాట్​ ఇప్పటికే ఎన్నో ఇంటర్వూల్లో స్పష్టం చేశాడు. ఇక శ్రీలంకకు చెందిన పేసర్​ మలింగ గురించి చెప్పడం ఇదే తొలిసారి.

ఆల్​ టైమ్​ ఆల్​రౌండర్​ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆస్ట్రేలియన్ దిగ్గజం షేన్​ వాట్సన్​ అని బదులిచ్చాడు. వెస్టిండీస్​ దిగ్గజం వివ్​ రిచర్డ్​ను లెజెండరీ బ్యాటర్​గా పేర్కొన్నాడు.2016 రాయ్​పూర్​ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై ఆర్సీబీ విజయం సాధించి నేరుగా ప్లే ఆఫ్స్​కు చేరుకోవడం.. ఐపీఎల్​ చరిత్రలో తనకు బెస్ట్​ మూమెంట్​ అని చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్​ రాయల్, ఛాలెంజర్స్​ బెంగళురు మధ్య జరిగే ప్రతీ మ్యాచ్​ను ఎంజాయ్ చేస్తానని కోహ్లీ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఆర్​సీబీ 10 మ్యాచ్​ల్లో గెలుపొందగా... చెన్నై 20 మ్యాచ్​ల్లో నెగ్గింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. చెన్నైపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్​ 37.88 సగటుతో 985 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇంకా మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు విరాట్​. ధోనీ నుంచి బెగ్​, బారో(అప్పు), స్టీల్​(దొంగతనం) ఏం చేస్తారు అని అడగగా.. క్వాడ్రీసెప్స్​(తొడ కండరాలు)ను బెగ్​ చేస్తాను, కావ్స్​(కాలి వెనక భాగంలో మోకాలి నుంచి మడమ వరకు ఉండే భాగం)ను అప్పుగా తీసుకుంటాను, కంపోజర్​(ప్రశాంతత)ను దొంగిలిస్తాను అని కోహ్లీ చెప్పాడు.

సునీల్​ నరైన్​, రషీద్​ ఖాన్​లలో బెస్ట్​ టీ20 బౌలర్​ ఎవరు అని అడగగా.. రషీద్ అని బదులిచ్చాడు. డివిలియర్స్, క్రిస్​ గేల్​లు ఇద్దరిలో ఎవరితో కలిసి బ్యాటింగ్​ను ఎంజాయ్​ చేస్తారని అడగగా.. నవ్వుతూ డివిలియర్స్​తో అని అన్నాడు. క్రికెటర్లు కాకుండా ఇతర క్రీడకు చెందిన ఆటగాళ్లలో ఎవరిని డిన్నర్​కు ఆహ్వానిస్తారు అన్న ప్రశ్నకు.. క్రిస్టియానో రొనాల్డొ, రోజర్​ ఫెడరర్​, మైఖెల్ జోర్డన్​ల పేర్లు చెప్పాడు.

ఆర్​సీబీ నుంచి తప్పుకుందామనుకున్నా.. విరాట్ ఒకప్పుడు ఆర్​సీబీ నుంచి వైదొలగాలని అనుకున్నాడట. గతంలో తనకు 5,6 స్థానాల్లో బ్యాటింగ్ ఇవ్వడమే ఆ ఆలోచనకు కారణం అని చెప్పాడు. అప్పట్లో తనను జట్టులోకి తీసుకోమని మరో ఫ్రాంచైజీనీ కూడా సంప్రదించారట. అయితే ఇందంతా పదేళ్ల క్రితం విషయమని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.