ETV Bharat / sports

బంతి కోసం గాల్లో ఈదిన బౌల్ట్! - బౌల్ట్ వీడియోపై కామెంట్లు

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే.. అంతకుముందు ఫీల్డింగ్​లో విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. బంతిని పట్టుకునేందుకు పాట్లు పడ్డాడు. ఈ వీడియోపై విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

trent boult, MI pacer boult
బౌల్ట్, ముంబయి పేసర్ బౌల్ట్
author img

By

Published : Apr 18, 2021, 11:54 AM IST

Updated : Apr 18, 2021, 12:46 PM IST

శనివారం ముంబయి ఇండియన్స్, సన్​రైజర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ముంబయి పేసర్ ట్రెంట్​ బౌల్డ్​ అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. బంతిని పట్టుకునేందుకు పాట్లు పడ్డాడు. ఏకంగా గాల్లో ఈత కొట్టినట్లు చేశాడు. ముంబయి విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని.. వార్నర్ సేన ఛేదిస్తున్న క్రమంలో ఐదో ఓవర్లో ఈ ఘటన జరిగింది.

బంతిని పరుగెత్తి పట్టుకోవాలా? లేక బంతి కోసం జంప్​ చేయాలా? అనే రెండు ఆలోచనలతో బౌల్ట్​ ఈ జంప్​ చేసిన సందర్భాన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. అసలేమైందంటే.. బంతి కోసం వేగంగా పరుగెత్తిన బౌల్ట్​ నియంత్రణ కోల్పోయి బంతిని ఆపలేక కిందపడ్డాడు.

ఎందులో డబ్బులు పెట్టినా స్టాక్​ మార్కెట్ కూడా ఇలాగే కుప్పకూలిందంటూ ఓ నెటిజన్​ కామెంట్ చేశాడు.

ఇదీ చదవండి:కేఎల్ రాహుల్..‌ 'పంజాబ్‌' కింగ్‌ మేకర్‌!

Last Updated : Apr 18, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.