ETV Bharat / sports

కృష్ణప్పను పార్టీ అడిగిన రోహిత్‌, హార్దిక్‌

ఐపీఎల్​ వేలంలో తనను రూ.9.25 కోట్లకు సీఎస్​కే​ జట్టు దక్కించుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని యువ క్రికెటర్​ కృష్ణప్ప గౌతమ్​ అన్నాడు. ఈ సందర్భంగా రోహిత్​ శర్మ, హార్దిక్​ పాండ్య తన దగ్గరకు వచ్చి అభినందనలు తెలుపుతూ.. పార్టీ అడిగారని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

rohit hardik asked me big party says krishnappa gowtham
కృష్ణప్పను పార్టీ అడిగిన రోహిత్‌, హార్దిక్‌
author img

By

Published : Feb 20, 2021, 7:03 AM IST

Updated : Feb 20, 2021, 7:11 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 వేలంలో తన పేరు కనిపించినప్పుడు ప్రతి నిమిషానికీ భావోద్వేగానికి గురయ్యానని కర్ణాటక స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ అన్నాడు. రూ.9.25 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్‌ తనను దక్కించుకున్నందుకు పట్టరాని సంతోషం కలిగిందని వెల్లడించాడు. టీమ్‌ఇండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య తనను కౌగిలించుకొని పార్టీ అడిగారని పేర్కొన్నాడు.

"టీవీ తెరపై నా పేరు కనిపించగానే ఆత్రుత పడ్డాను. చాలా ఆందోళనకు గురయ్యాను. అహ్మదాబాద్‌కు అప్పుడే చేరుకొని టీవీ పెట్టాను. వేలం జరుగుతుంటే ప్రతి నిమిషానికీ భావోద్వేగం చెందాను. వెంటనే రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య నా గది తలుపు తట్టారు. నన్ను కౌగిలించుకొని పెద్ద పార్టీ అడిగారు. ఇక మా తల్లిదండ్రులైతే ఆనంద బాష్పాలు కార్చారు. ఎంతో సంతోషించారు. నా అనుభూతిని వర్ణించడం కష్టం. నాకిదే తొలివేలం కాదు. కానీ ప్రతిసారీ వేలంలో మన పేరు కనిపిస్తుంటే మనసులో కలిగే అనుభూతిని ఊహించలేం. ధోనీని తొలిసారి కలిసినప్పుడు నా ఆటను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడం ఎలాగో అడిగాను. ఆ తర్వాత రెండుమూడు సార్లు కొద్ది సమయం మాట్లాడాను. ఇప్పుడిక చెన్నై జట్టులో భాగమై ఎక్కువసార్లు సంభాషించాలని కోరుకుంటున్నా. సీఎస్‌కే ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా."

- కృష్ణప్ప గౌతమ్​, ఫస్ట్​క్లాస్​ క్రికెటర్​

టీమ్‌ఇండియాకు ఆడకుండానే వేలం అత్యధిక ధర పలికిన దేశవాళీ క్రికెటర్‌గా కృష్ణప్ప రికార్డు సృష్టించాడు. 2018లో రూ.8.8 కోట్లతో కృనాల్‌ పాండ్య సృష్టించిన రికార్డును అతడు బద్దలు కొట్టాడు. ప్రస్తుతం కృష్ణప్ప భారత జట్టుకు నెట్‌బౌలర్‌గా అహ్మదాబాద్‌లో ఉన్నాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్ వేలం: ఫ్రాంఛైజీల ఉత్తమ, అనూహ్య నిర్ణయాలు ఇవే!

Last Updated : Feb 20, 2021, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.