Rishi Dhawan New Helmet: సాధారణంగా క్రికెట్లో బ్యాటర్ హెల్మెట్లు వాడుతుంటారు. వేగంగా వచ్చే బంతులు తలకు నేరుగా తగలకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇక ఫీల్డింగ్ జట్టులోని ఆటగాళ్లు సైతం కొన్నిసార్లు హెల్మెట్లు ఉపయోగిస్తుంటారు. బ్యాటర్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేసినప్పుడు రక్షణగా వీటిని పెట్టుకోవడం మనం చూస్తుంటాం. ఇక.. ఈ మధ్య అంపైర్లు సైతం రక్షణగా గార్డులను వాడుతున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. బౌలర్లు ఎప్పుడైనా హెల్మెట్లు వాడటం చూశారా? లేదు కదా? సోమవారం మ్యాచ్‌లో అదే జరిగింది.
పంజాబ్ బౌలర్ రిషి ధావన్.. ముఖానికి ఓ గార్డు పెట్టుకొని బౌలింగ్ చేశాడు. టీవీలో రిషి అవతారాన్ని చూడగానే చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. హెల్మెట్ లాంటి పరికరాన్ని పెట్టుకున్న రిషిని చూసి.. నెటిజన్లు వెంటనే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. 'అది హెల్మెటా? లేకా మాస్కా?' అంటూ ట్వీట్లు చేశారు. అయితే, రక్షణ కోసమే రిషి గార్డును ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
భార్య పర్మిషన్తో మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా...