ETV Bharat / sports

రాజస్థాన్​ రాయల్స్​కు షాక్​.. టోర్నీ నుంచి స్టార్​ బౌలర్​ ఔట్​

Rajasthan Royals: రాజస్థాన్​ రాయల్స్​కు గట్టి షాక్​ తగిలింది. ఐపీఎల్​ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు ఆ జట్టు బౌలర్​, ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్​ కౌల్టర్​ నీల్​. ఈ విషయాన్ని రాజస్థాన్​ యాజమాన్యం ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

Nathan Coulter Nile
నాథన్​ కౌల్టర్​ నీల్
author img

By

Published : Apr 6, 2022, 6:59 PM IST

Rajasthan Royals: బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో ఓటమి పాలైన రాజస్థాన్​ రాయల్స్​కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్​ బౌలర్​ నాథన్​ కౌల్టర్​నీల్​ గాయం కారణంగా ఈ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్​ హైదరాబాద్​తో తలపడిన సమయంలో చివరి ఓవర్​ బౌలింగ్​ చేస్తుండగా నాథన్​ గాయపడ్డాడు. 34 ఏళ్ల ఈ క్రికెటర్​ స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లనున్నట్లు రాజస్థాన్​ రాయల్స్​ ట్విట్టర్​ వేదికగా ఓ వీడియో పోస్ట్​ చేసింది.

" ఇది దురదృష్టకరం. నాథన్​కు వీడ్కోలు పలకటం చాలా కష్టమైన పని. జట్టులోంచి ఒకరికి దూరం కావటం ఎప్పుడూ కష్టమే. ముఖ్యంగా గాయం కారణంగా దూరమైనప్పుడు. ఈ టోర్నీ మొత్తం నీతో పూర్తి సమయం గడపాలని మేమంతా అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది జరగటం లేదు. అయినా.. నీవు మాలో ఒకడివి. మా నుంచి ఏ అవసరం ఉన్నా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మాతో తిరిగి కలవాలని కోరుకుంటున్నా."

- జాన్​ గ్లోస్టెర్​, హెడ్​ ఫిజియో

హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో 3 ఓవర్లు వేసిన నాథన్ వికెట్​ లేకుండా..​ 48 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్​లో ఆర్​ఆర్​ ఘనవిజయం సాధించింది. ఐపీఎల్​ మెగా వేలంలో నాథన్​ కౌల్టర్​నీల్​ను రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్​ రాయల్స్​. ఐపీఎల్​లో 38 మ్యాచ్​లాడిన నాథన్​ 48 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: 'అతడిని దక్కించుకోవడమే ఐపీఎల్​ వేలంలో అత్యుత్తమ కొనుగోలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.