అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు వరుస ఓటములతో సతమవుతోన్న పంజాబ్.. ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని ప్లాన్స్ వేస్తోంది.
గెలుపు లాంఛనమేనా?
టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లో ఐదు విజయాలతో ఆర్సీబీ దూసుకెళ్తోంది. ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పంజాబ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని ప్రణాళికలను రచిస్తోంది.
సరిదిద్దుకుంటారా?
ఇటీవల కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్.. ఈ మ్యాచ్‌తో తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండింటిలో నెగ్గి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ జట్టులో టాప్ ఆర్డర్ నుంచి బౌలింగ్ లైనప్ వరకు ఆటగాళ్లందరూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. అయితే ఆ తప్పులను సరిదిద్దుకొని బెంగళూరుతో మ్యాచ్‌లోనైనా రాణిస్తారేమో చూడాలి.
జట్లు(అంచనా)
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, మ్యాక్స్‌వెల్, డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, జేమిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, పాటిదార్, చాహల్, సామ్స్
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హెన్రిక్స్, షారుక్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
ఇదీ చూడండి.. సీఎస్కే టీమ్ మెంబర్ అంత పనిచేశాడా?