ETV Bharat / sports

IPL 2023 CSK VS RR : ఈ ప్లేయర్స్​ ఆ రికార్డులను అందుకుంటారా? - అశ్విన్ ఐపీఎల్ 300 వికెట్లు

ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా నేడు(ఏప్రిల్​ 27) రాజస్థాన్ రాయల్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ పోటీ పడనున్నాయి. జైపుర్​లోని సవాయ్ మాన్​సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో ఇరు జట్ల ​ ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులేంటంటే...

rahane buttler ashwin will reach some milestones

author img

By

Published : Apr 27, 2023, 6:28 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ అంటేనే రికార్డులకు నెలవు. ప్రతీ సీజన్​లో ఎన్నో రికార్డులను నెలకొల్పుతుంటారు ఆటగాళ్లు. అయితే ఈరోజు జరిగే రాజస్థాన్ చెన్నై మ్యాచ్​లోనూ ఆయా ప్లేయర్లను కొన్ని రికార్డులు కవ్విస్తున్నాయి. సగం మ్యాచ్​లు పూర్తయిన ఈ సీజన్​లో ఇంకో సగం మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్​లో ఇంకా ఇప్పటి వరకూ పెద్దగా రికార్డులేమీ నమోదు కాలేదు. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్​లో ఇరు జట్ల ఆటగాళ్లు కొన్ని రికార్డులకు చేరువలో ఉన్నారు. వారెవరు.. ఆ రికార్డులేంటో చూసేద్దాం...
1. అజింక్య రహానే : టెస్ట్ బ్యాటర్​గా ముద్ర వేసుకున్న రహానే ఈ సీజన్​లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. చెన్నై తరఫున ఆడుతున్న రహానే కెరియర్​ అత్యుత్తమ స్ట్రయిక్​ రేట్​తో బౌలర్ల భరతం పడుతున్నాడు. అయితే ఈరోజు రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో రహానే ఓ రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. ఐపీఎల్​లో ఇప్పటి వరకు 449 ఫోర్లు కొట్టాడు. ఇంకొక బౌండరీ సాధిస్తే... 450 ఫోర్లు బాదిన 8వ ఆటగాడిగా రహానే నిలుస్తాడు. ఐపీఎల్​ హిస్టరీలో అత్యధిక ఫోర్లు (730) బాదిన రికార్డు ధవన్​ పేరిట ఉంది. తర్వాత వార్నర్(621), విరాట్​(609) రోహిత్​(539) లు వరసగా ఉన్నారు. ఇలా టాప్​​ 10లో ఎనిమిది మంది భారత ఆటగాళ్లు ఉండటం విశేషం.
2. రవిచంద్రన్​ అశ్విన్​: క్యారమ్ బంతులతో బ్యాటర్లను తికమక పెట్టే అశ్విన్​ ముందు ఓ మైలురాయి ఉంది. ఇప్పటి వరకు అశ్విన్​ ఆడిన టీ20 మ్యాచ్​ల్లో 296 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు నేలకూలిస్తే.. టీ20ల్లో 300 వికెట్లు తీసిన రెండో భారత ప్లేయర్​గా రికార్డులకెక్కుతాడు. అశ్విన్​ కంటే ముందు తన సహచర బౌలర్​ యుజ్వేంద్ర చాహల్​ (311) వికెట్లతో ముందున్నాడు. మరి అశ్విన్ తన మాజీ ఫ్రాంచైజీ చెన్నై మీద ఈ ఘనత సాధిస్తాడో లేదోనని రాజస్థాన్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుత సీజన్​లో అశ్విన్​ 9 వికెట్లు పడగొట్టాడు.
3. బట్లర్​: ఈ మ్యాచ్​లో మరో మైలురాయికి దగ్గర్లో ఉన్న ప్లేయర్​ జాస్​ బట్లర్​. ఐపీఎల్​లో 2018 నుంచి రాజస్థాన్ జట్టుకు ఆడుతున్న ఈ ఇంగ్లాండ్​ ప్లేయర్... ఆర్ఆర్​ తరఫున 64 ఇన్నింగ్స్​ల్లో కలిపి 44.7 సగటున 2548 పరుగులు చేశాడు. ఇందులో 22 సార్లు 50 పై చిలుకు స్కోర్​ నమోదు చేశాడు. ఇందులో 17 హాఫ్​ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. ఈరోజు చెన్నైతో మ్యాచ్​లో గనక బట్లర్​ 50 పరుగులు చేస్తే... రాజస్థాన్ తరఫున ఎక్కువ 50+ స్కోర్లు నమోదు చేసిన జాబితాలో రహానే సరసన నిలుస్తాడు. అంతకు ముందు రహానే 21 హాఫ్​ సెంచరీలు, 2 సెంచరీలు రాజస్థాన్ జట్టులో ఉన్నప్పుడు చేశాడు. అలా ఈ మూడింట్లో ఎవరు ముందు ఆయా రికార్డులను అందుకుంటారా అని ఇరు జట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.