భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు, ముంబయి ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ తెందుల్కర్ పేరు ప్రస్తుతం ఐపీఎల్లో మార్మోగిపోతోంది. ఎందుకంటే అతడు రీసెంట్గా తన ఫస్ట్ ఐపీఎల్ వికెట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్.. ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కెరీర్లో తన తొలి ఐపీఎల్ వికెట్ తీశాడు. అలా తన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులతో పాటు సహా ఆటగాళ్లను ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ తెందుల్కర్.. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచి ఆ వికెట్‌ను దక్కించుకున్నాడు. దీంతో అతడిపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే అర్జున్ తెందుల్కర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టే సత్తా ఉంది. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సెంచరీ బాది అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ముంబయి ఇండియన్స్ తమ నెక్స్ట్స్ మ్యాచ్.. ఏప్రిల్ 22న వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. దీనికోసం.. ఇప్పటికే ముంబయి చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అర్జున్ కూడా నెట్ ప్రాక్టీస్‌లో బాగా చెమటోడుస్తున్నాడు. ఈ సారి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తమ బౌలర్లు బంతుల్ని సంధిస్తుంటే.. అర్జున్ అదిరిపోయే ధనాధన్ షాట్లు ఆడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ అధికార ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన సచిన్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. నెక్ట్స్ మ్యాచ్‌లో అర్జున్ ధనాధన్ బ్యాటింగ్ చేస్తాడని కామెంట్లు చేస్తున్నారు.
సచిన్ వరెస్స్ అర్జున్.. ఇకపోతే అర్జున్ తన తొలి వికెట్ తీసినప్పుడు సచిన్.. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు చేసుకున్నాడు. అలాగే వీరిద్దరిని పోలిస్తే.. అర్జున్ వికెట్ ఎంత గొప్పదో కూడా తెలుస్తుంది. ఎందుకంటే సచిన్ తన ఐపీఎల్ కెరీర్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. 2009లో సచిన్ ఆరు ఓవర్లు వేసినా.. ఒక్క వికెట్ కూడా సాధించలేదు. ఇప్పుడీ విషయంలో సచిన్‌ను అర్జున్ అధిగమించాడు. అలానే ఈ తండ్రీకుమారుల మధ్య మరో పోలిక కూడా ఉంది. 2009 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ తరఫున తొలిసారిగా బౌలింగ్ చేసిన సచిన్ తెందుల్కర్.. మొదటి ఓవర్‌లో 5 పరుగులే సమర్పించుకున్నాడు. ఇటీవల అదే కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కూడా తన తొలి ఓవర్‌లో ఐదు పరుగులే ఇవ్వడం విశేషం.
-
𝕊𝕥𝕣𝕚𝕜𝕚𝕟𝕘 so good, you'd think it was their first job 😍 Look again 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/2QRlreAOID
— Mumbai Indians (@mipaltan) April 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝕊𝕥𝕣𝕚𝕜𝕚𝕟𝕘 so good, you'd think it was their first job 😍 Look again 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/2QRlreAOID
— Mumbai Indians (@mipaltan) April 19, 2023𝕊𝕥𝕣𝕚𝕜𝕚𝕟𝕘 so good, you'd think it was their first job 😍 Look again 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/2QRlreAOID
— Mumbai Indians (@mipaltan) April 19, 2023
ఇదీ చూడండి: 'క్రీజులో రాహుల్ ఉంటే బౌలర్లకు చుక్కలే.. శాంసన్ కన్నా అతడు చాలా బెటర్!'