ETV Bharat / sports

CSK vs KKR : రింకూ-నితీశ్ హాఫ్​ సెంచరీ.. కోల్‌కతా ఇంకా రేసులోనే..

IPL 2023 CSK vs KKR : IPLలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు.. కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. CSKను వారి సొంత మైదానంలో 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ఇంకా ప్లేఆఫ్స్​ రేసులో నిలిచింది.

Chennai Super Kings vs Kolkata Knight Riders

author img

By

Published : May 14, 2023, 11:03 PM IST

Updated : May 15, 2023, 6:32 AM IST

IPL 2023 CSK vs KKR : ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023లో భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్, కోల్​కతా నైట్ రైడర్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. అయితే ఈ మ్యాచ్​లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు.. కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. CSKను వారి సొంత మైదానంలో 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ఇంకా ప్లేఆఫ్స్​ రేసులో నిలిచింది. అయితే వాస్తవానికి ఈ ప్లేఆఫ్స్‌ చేరడం చాలా కష్టమే అయినా.. ఆరో విజయంతో సాంకేతికంగానైనా తన అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌.. బ్యాటర్లు రింకూ సింగ్‌, నితీశ్‌ రాణాల చక్కని ప్రదర్శనతో చెన్నైను కోల్‌కతా ఓడించింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే చెన్నై ప్లేఆఫ్స్‌ చేరేది. అయితేనే ఓడినప్పటికీ రేసులో చాలా ముందుంది.

చెన్నై నిర్దేశించిన 145 సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్​కతా ఆది నుంచి తడబడింది. ఓ దశలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్​ జేసన్​ రాయ్​ (12) పరుగులకే పెవిలియన్ చేరగా.. గుల్భాజ్​ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత తర్వాత వచ్చిన వెంకటేశ్​ అయ్యర్​ కూడా ఆకట్టుకోలేక పోయాడు. 4 బంతులు ఎదుర్కొని 9 పరుగులతే ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత దిగిన నితీశ్​ రాణా (50), రింకూ సింగ్​ (54) అద్భుత ప్రదర్శన చేసి KKRను ఆదుకున్నారు. 18వ ఓవర్లలోనే KKR లక్ష్యాన్ని చేధించింది. CSK బౌలర్లలో దీపక్‌ చాహర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు, టాస్​ గెలిచి బ్యాటింగ్​ దిగిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కోల్​కతా బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడం వల్ల.. చెన్నై సూపర్ కింగ్స్​ బ్యాటర్లు పరుగులు తీయలేకపోయారు. దీంతో స్వల్ప స్కోరుకే చెన్నై పరిమితమైంది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన CSKలో శివమ్‌ దూబె(48 నాటౌట్‌; 34 బంతుల్లో 1×4, 3×6) పరుగులతో రాణించాడు. కాస్తలో హాఫ్​ సెంచరీ కాస్తలో మిస్సయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (17), డేవాన్‌ కాన్వే(30), రహానె(16), రవీంద్ర జడేజా(20) పరుగులు చేశారు. ఇక, కోల్​కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి(2/36) , సునీల్‌ నరైన్‌లు(2/15) రెండు వికెట్ల చొప్పున తీసి ఆ జట్టుకు కళ్లెం వేయగా.. వైభవ్‌ అరోరా, శార్దూల్‌ ఠాకూర్‌లు ఒక్కో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: RR Vs RCB : 60పరుగుల​ లోపు రాజస్థాన్​ రెండు సార్లు ఆలౌట్​.. మరి ఆర్సీబీ పరిస్థితేంటి?

Last Updated : May 15, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.