సాధారణంగా మ్యాచ్ ఆడేటప్పుడు ధోనీ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికే తెలిసిందే. అందుకే అతడిని మిస్టర్ కూల్ అని కూడా అంటుంటారు. కానీ తాజాగా అతడు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కాస్త అసహనానికి గురయ్యాడు. సాధారణంగా మ్యాచ్‌లో మహీ రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే వస్తుంది. మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే మహీ రివ్యూ విషయంలో ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. కానీ ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలిసారి అతడి లెక్క తప్పినట్టుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహీ.. యశస్వి జైశ్వాల్ విషయంలో రివ్యూకు వెళ్లగా.. అంపైర్ మహీకి అనకూలమైన తీర్పు ఇవ్వలేదు.
తీక్షణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని.. జైశ్వాల్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి బాల్‌ను మిస్ చేశాడు. ఈ క్రమంలోనే బాల్ అతడి ప్యాడ్లను తాకి కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. అప్పుడు అంపైర్‌కు అప్పీల్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మహీ డీఆర్‌ఎస్ కోరాడు. అయితే డీఆర్ఎస్లో.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికీ లెగ్‌స్టంప్ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్ అయినట్లు చూపించింది. దీంతో జైశ్వాల్ నాటౌట్ అని తేలింది. సీఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్ ధాటిగా ఆడడంతో.. ఓ దశలో తమ బౌలర్లపై ధోనీ అసహనం కూడా వ్యక్తం చేశాడు.
-
DRS Means Dhoni Review System Bro 🔥..#CSKvRR pic.twitter.com/ezLnZ3UQYY
— ஒத்த கை உலககோப்பை (@ok_uk_) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">DRS Means Dhoni Review System Bro 🔥..#CSKvRR pic.twitter.com/ezLnZ3UQYY
— ஒத்த கை உலககோப்பை (@ok_uk_) April 27, 2023DRS Means Dhoni Review System Bro 🔥..#CSKvRR pic.twitter.com/ezLnZ3UQYY
— ஒத்த கை உலககோப்பை (@ok_uk_) April 27, 2023
ధోనీ మరోసారి.. ఇకపోతే ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ధోనీ మరోసారి కూడా అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో పతీరానా బౌలింగ్ వేశాడు. అయితే ఆ ఓవర్లో బంతి బ్యాటింగ్ చేస్తున్న హెట్‌మెయర్ కాలికి తగిలి ధోని వైపు వెళ్లింది. అంపైర్ లెగ్‌బై ఇవ్వగా హెట్‌మెయర్ పరుగుకు ప్రయత్నించాడు. బాల్‌ను అందుకున్న మహీ నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు డైరెక్ట్ త్రో వేశాడు. కానీ పతీరానా బాల్‌ను అందుకునే ప్రయత్నంలో త్రోకు కాస్త అడ్డు వచ్చాడు. అయితే అప్పటికీ హెట్‌మెయర్ క్రీజులోకి చేరుకోలేదు. ఒకవేళ మహీ వేసిన త్రో వికెట్లకు తాకుంటే హెట్‌మెయర్ రనౌట్ అయ్యేవాడే. రనౌట్ ఛాన్స్ మిస్ అవ్వడంతో ధోని.. పతీరానాను చూస్తూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు. అయితే హెట్‌మెయర్.. 16 ఓవర్ రెండో బంతికే ఔటయ్యాడు. 8 పరుగులు చేసిన అతడు తీక్షణ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు.
ఇదీ చూడండి: రఫ్ఫాడిస్తున్న సీనియర్స్.. రికార్డ్స్‌తో యంగ్ ప్లేయర్స్‌కు సవాల్