గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ చెలరేగడం వల్ల మొదట రాజస్థాన్ 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. దీంతో ఛేదనలో చెన్నై తడబడింది. 6 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. రుతురాజ్ శివమ్ దూబె, రాణించారు. ఆడమ్ జంపా, అశ్విన్ తమ స్పిన్‌తో సూపర్‌కింగ్స్ టీమ్‌ను ఓటమి బాట పట్టేలా చేశారు.
భారీ లక్ష్య ఛేదనలో బలమైన ఆరంభం అవసరం అయినప్పటికీ దానికి భిన్నంగా మొదలైంది చెన్నై ఇన్నింగ్స్. రుతురాజ్, కాన్వే కాస్త జాగ్రత్తగా ఆడటం వల్ల మొదటి మూడు ఓవర్లలో 13 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత రుతురాజ్ జోరు పెంచి బ్యాట్ ఝుళిపించినప్పటికీ .. మరోవైపు కాన్వే ఔటయ్యాడు. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి చెన్నై 68/1 మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత అశ్విన్, జంపా తమ స్పిన్నింగ్ స్కిల్స్‌తో చెన్నై టీమ్‌ను తడబడేలా చేశారు. రుతురాజ్‌ను జంపా వెనక్కి పంపగా.. అశ్విన్ ఒకే ఓవర్లో రహానె, రాయుడులను ఔట్ చేశాడు. దీంతో ఇక 11 ఓవర్లలో 73/4తో చెన్నై గెలుపు కష్టమే అనిపించింది.
కానీ అదే సమయంలో దిగిన శివమ్ దూబె.. సిక్సర్ల మోతతో ఆ జట్టును కాస్త పోటీలోకి తీసుకొచ్చాడు. అతడికంటే ముందే మైదానంలోకి దిగిన మొయిన్ అలీ బాదుడు మొదలెట్టాడు. దీంతో రాయల్స్‌కు ఇక కలవరం తప్పలేదు. కానీ 15వ ఓవర్లో అలీని జంపా ఔట్ చేశాడు. ఆ తర్వాత దూబె దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించినప్పటికీ.. అది ఏ మాత్రం జట్టు గెలుపుకు దోహదపడలేదు. చివరి మూడు ఓవర్లలో 58 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
జడేజా కూడా కాస్త జోరు అందుకున్నా.. చెన్నై సమీకరణం చివరి రెండు ఓవర్లలో 46కు మారడంతో రాయల్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. 19వ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేసిన హోల్డర్ కేవలం 9 పరుగులే ఇవ్వడంతో రాయల్స్ విజయం లాంఛనమే అయింది. కుల్‌దీప్ యాదవ్ (1/18), సందీప్ శర్మ (0/24) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు.
మెరిసిన జైస్వాల్: రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో మాత్రం యశస్వి జైస్వాల్ ఆటే హైలైట్‌గా నిలిచింది. విధ్వంసక బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాన్నిచ్చిన అతడు.. జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. మధ్యలో రాయల్స్‌ను చెన్నై కట్టడి చేసినా.. చివర్లో మళ్లీ బ్యాటర్లు బ్యాట్ ఝుళిపించారు. అలా చెన్నైపై గెలిచారు.
ఇదీ చూడండి: IPL 2023 RR VS CSK : ధోనీ అసహనం.. ఈ సీజన్లో తొలిసారి లెక్క తప్పింది!