ETV Bharat / sports

IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్​కు గుజరాత్​.. రాజస్థాన్​పై గెలుపు - gujarat titans vs rajasthan royals qualifier 1

IPL 2022: ఐపీఎల్​ 2022లో అరంగేట్రంలోనే ఫైనల్​ చేరింది గుజరాత్ టైటాన్స్​. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్​లో రాజస్థాన్​ రాయల్స్​పై 7 వికెట్ల తేడాతో గెలిచింది.

IPL 2022
Rajasthan Royals VS Gujarat titans
author img

By

Published : May 24, 2022, 11:32 PM IST

IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్​లో అడుగుపెట్టేసింది గుజరాత్ టైటాన్స్​. కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా చివరి వరకు ఉత్కంఠగా జరిగిన తొలి క్వాలిఫైయర్​లో రాజస్థాన్ రాయల్స్​పై ఘన విజయం సాధించింది. సంజూసేన నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాహా డకౌట్​గా వెనుతిరగగా.. గిల్ (35)​, మ్యాథ్యూ వేడ్ (35)​ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హార్దిక్ (40), డేవిడ్ మిల్లర్​ (68) లక్ష్యాన్ని పూర్తి చేశారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్​కాయ్​ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​.. ఓపెనర్ జోస్ బట్లర్ (89) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188/6 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (47), దేవదత్‌ పడిక్కల్ (28) ఫర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్ 3, హెట్‌మయిర్ 4, రియాన్ పరాగ్ 4, అశ్విన్ 2* పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, దయాల్, సాయికిశోర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.