ETV Bharat / sports

Virat Kohli: నా మెదడును స్కాన్​ చేయిస్తా: విరాట్ కోహ్లీ - ఆర్సీబీ

Virat Kohli: తన బ్రెయిన్​ను స్కాన్​ చేయిస్తానని చెప్పాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఫుట్​బాల్​ గ్రేట్​ క్రిస్టియానో రొనాల్డో గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చాడు. ఇంతకీ అదేంటంటే?

virat kohli cristiano ronaldo
Virat Kohli
author img

By

Published : Apr 4, 2022, 5:56 PM IST

Virat Kohli: ఫుట్​బాల్​ దిగ్గజం క్రిస్ట్రియానో రొనాల్డో అంటే తనకు ఎంత ఇష్టమో ఇప్పటికే అనేక సందర్భాల్లో వెల్లడించాడు టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్ విరాట్ కోహ్లీ. పని పట్ల రొనాల్డో నిబద్ధత కారణంగా అతడి జట్టు మాంచెస్టర్​ యునైటెడ్​ ఎన్నో అపూర్వమైన విజయాలను సాధించింది. ఐపీఎల్​ ఫొటోషూట్​ సందర్భంగా రొనాల్డో గురించి ఇటీవలే అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు కోహ్లీ. 'ఒకానొక రోజు రొనాల్డోగా నిద్రలేస్తే ఏం చేస్తారు?' అనే ప్రశ్నకు విరాట్​.. ఏమన్నాడంటే..

virat kohli cristiano ronaldo
కోహ్లీ-రొనాల్డో

"క్రిస్టియానో రొనాల్డో! (ఇష్టమైన అథ్లెట్​ ఎవరని అడిగినప్పుడు).. నేను రొనాల్డోగా నిద్రలేస్తే.. నా మెదడును స్కాన్​ చేయిస్తా. అప్పుడు ఇంత మానసిక దృఢత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటా (నవ్వుతూ)"

-విరాట్ కోహ్లీ, ఆర్సీబీ బ్యాటర్

రొనాల్డో అత్యద్భుతమైన మనోబలమే.. తన రంగంలో (క్రికెట్​లో) ఉత్తమంగా రాణించేందుకు దోహదపడిందని కోహ్లీ భావిస్తుంటాడు. ఇక తన మనసును విరిచేసిన మ్యాచ్​ ఏది? అని అడినప్పుడు.. ఐపీఎల్​ 2016 ఫైనల్ (సన్​రైజర్స్​తో)​ అని సమాధానమిచ్చాడు విరాట్. ఆ సీజన్​లో అన్ని రికార్డులను తుడిచిపెడుతూ.. 973 పరుగులతో ఆరెంజ్​ క్యాప్​కు దక్కించుకున్నాడు కోహ్లీ. అయితే ఫైనల్లో మాత్రం సన్​రైజర్స్​ చేతిలో ఓటమితో టైటిల్​ సాధించలేకపోయాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక 2016 టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో​ వెస్టిండీస్​ చేతిలో ఓటమి కూడా తనను అత్యంత కలచివేసిందని తెలిపాడు విరాట్. ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన అతడు​.. ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​గానూ నిలిచాడు. ఐపీఎల్​ 2022 సీజన్​తోనే ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీ.. బ్యాట్​తో మరోసారి మునుపటిలా రెచ్చిపోవాలని చూస్తున్నాడు. ప్రస్తుత సీజన్​లో ఇప్పటికే రెండు లీగ్​ మ్యాచ్​లు ఆడిన ఆర్సీబీ.. ఒకదాంట్లో విజయం సాధించింది. తన తదుపరి మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​తో ఏప్రిల్​ 5న తలపడనుంది.

ఇదీ చూడండి: 'ఫుట్​బాల్​కు రొనాల్డో.. క్రికెట్​కు విరాట్ కోహ్లీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.