ETV Bharat / sports

హార్దిక్​ బౌలింగ్ చేయకపోవడానికి కారణమదే! - హార్దిక్ పాండ్య

భుజం సమస్య కారణంగా బెంగుళూరుతో మ్యాచ్​లో హార్దిక్ పాండ్య బరిలోకి దిగలేదని.. ముంబయి ఇండియన్స్​ డైరెక్టర్​ జహీర్ ఖాన్ వెల్లడించాడు. త్వరలోనే అతడు తిరిగి బౌలింగ్ చేస్తాడని తెలిపాడు. అతడి సమస్య గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశాడు.

Hardik had shoulder concern but will bowl soon: Zaheer
హార్దిక్​ బౌలింగ్ చేయకపోవడానికి కారణమదే!
author img

By

Published : Apr 12, 2021, 4:30 PM IST

Updated : Apr 12, 2021, 5:24 PM IST

భుజం సమస్య కారణంగా బెంగుళూరుతో మ్యాచ్​లో హార్దిక్​ పాండ్య బౌలింగ్​కు దిగలేదని వెల్లడించాడు ముంబయి ఇండియన్స్ క్రికెట్​​ డైరెక్టర్ జహీర్​ ఖాన్. అయితే అతి త్వరలోనే అతడు తిరిగి బౌలింగ్​ చేస్తాడని స్పష్టం చేశాడు.

"లీగ్​ మొత్తంలో హార్దిక్​ ఎంత విలువైన ఆటగాడో మనందరికీ తెలుసు. పని ఒత్తిడి నిర్వహణలో భాగంగా తొలి మ్యాచ్​లో అతడు బౌలింగ్​కు దిగలేదు. ఇంగ్లాండ్​తో సిరీస్​లో బౌలింగ్ చేశాడు. చివరి వన్డేలో అయితే ఏకంగా 9 ఓవర్లు బంతిని విసిరాడు. హార్దిక్​కు కొంచెం భుజం సమస్య ఉంది. కానీ, ఆందోళన చెందాల్సినంత పెద్దదేమీ కాదు. త్వరలోనే అతడు బౌలింగ్​కు దిగుతాడు. బంతితోనూ అతడు రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను" అని జహీర్ తెలిపాడు.

ఇదీ చదవండి: 'ఐపీఎల్​లోనూ దేశవాళీ ఫామ్​ను కొనసాగిస్తా'

విండీస్​ ఆటగాడు కీరన్ పొలార్డ్​ను బౌలింగ్​లో తమ ఆరో ప్రాధాన్యత​గా తీసుకుంటామని జహీర్ తెలిపాడు. ఆ విభాగంలో తాము ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నాడు. కాకపోతే ఆటగాళ్లను సర్దుబాట్లు చేయాలని అభిప్రాయపడ్డాడు. ఇదొక ఆరోగ్యకరమైన సమస్య అని చెప్పాడు.

ఇకపోతే దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్​ డికాక్​.. మంగళవారం నాటి మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని జహీర్​ వెల్లడించాడు. "అతడి క్వారంటైన్​ సమయం ముగిసింది. క్రితంరోజు ప్రాక్టీస్​ మ్యాచ్​లోనూ పాల్గొన్నాడు. తదుపరి గేమ్​లో అతడు అందుబాటులో ఉంటాడు" అని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 'వాతి కమింగ్'​కు చిందులేసిన సన్​రైజర్స్​ ఆటగాళ్లు

Last Updated : Apr 12, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.