ఐపీఎల్ 2021(IPL 2021 News) సీజన్లో ప్లేఆఫ్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం చివరి మ్యాచ్ ఆడేసింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్(david warner ipl) భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టాడు.
"ఈ జ్ఞాపకాలకు ధన్యవాదాలు. అభిమానులారా.. మా జట్టు ఎప్పుడూ వంద శాతం ప్రదర్శన చేసేలా నడిపించిన శక్తి మీరే. మీ మద్దతుకు సరిపడా కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నా. ఇదో గొప్ప ప్రయాణం. నేను, నా కుటుంబం మిమ్మల్ని మిస్ కాబోతున్నాం" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
భారత్‌లో జరిగిన ఈ సీజన్(IPL 2021 News) తొలి దశలో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా వార్నర్(david warner ipl) ను కెప్టెన్‌గా తప్పించి ఆ బాధ్యతలను విలియమ్సన్‌కు అప్పజెప్పింది యాజమాన్యం. ఆ తర్వాత ఆటగాడిగానూ వార్నర్‌కు జట్టులో చోటు దక్కలేదు. యూఏఈ అంచె పోటీల్లో అతను కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లాడి 195 పరుగులు చేశాడు. మరోవైపు సన్‌రైజర్స్‌తో వార్నర్‌కు ఇదే చివరి సీజన్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2016లో జట్టును విజేతగా నిలిపిన అతణ్ని.. కావాలనే కెప్టెన్‌గా తప్పించి, ఆ తర్వాత జట్టులోనూ లేకుండా చేశారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.