ETV Bharat / sports

మాజీ బౌలర్​పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం - హీత్ స్ట్రీక్ లేటేస్ట్ న్యూస్

అవినీతి ఆరోపణలు ఒప్పుకొన్న కారణంగా జింబాబ్వే మాజీ బౌలర్, కెప్టెన్ హీత్ స్ట్రీక్​పై ఐసీసీ, ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. తాను కోచ్​గా ఉన్న సమయంలోనే హీత్​ ఈ అవినీతి చేశాడు.

Heath Streak handed eight-year ban
హీత్ స్ట్రీక్​పై ఐసీసీ నిషేధం
author img

By

Published : Apr 14, 2021, 8:05 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ).. జింబాబ్వే మాజీ బౌలర్ హీత్ స్ట్రీక్​పై ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించింది. గతంలో పలుమార్లు అవినీతి నిరోధక కోడ్​ను ఇతడు ఉల్లంఘించాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిని ఒప్పుకొన్నాడు.

జింబాబ్వే తరఫున 189 వన్డేలు, 65 టెస్టుల్లో వరుసగా 239, 216 వికెట్లు తీశాడు. రిటైర్మెంట్ తర్వాత కోచ్​గా పనిచేసిన హీత్​.. ఆ సమయంలోనే అవినీతి చేసినట్లు తేలింది.

2017, 2018లో పలు మ్యాచ్​ల్లో భాగంగా తన ఆటగాళ్ల దగ్గరకు బుకీలను అనుమతించాడు హీత్ స్ట్రీక్. వీటిలో ఐపీఎల్, బీపీ​ఎల్, ఆఫ్ఘానిస్థాన్ ప్రీమియర్​ లీగ్​లోని మ్యాచ్​లు ఉన్నాయి. అయితే తన చర్యలు, ఈ మ్యాచ్​ల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.