ETV Bharat / sports

రోహిత్​ వల్లే ఐపీఎల్ అరంగేట్రం చేశా: చాహల్

టీమ్​ఇండియా ఆటగాళ్లు రోహిత్​ శర్మ, కుల్దీప్​ యాదవ్​లతో మంచి అనుబంధం ఉందని తెలిపాడు స్పిన్నర్​ చాహల్​. వారద్దరూ అన్ని పరిస్థితుల్లోనూ తనకు తోడుగా ఉన్నారని అన్నాడు. రోహిత్​ వల్లే తన ఐపీఎల్​ అరంగేట్రం సాధ్యమైందని వెల్లడించాడు.

author img

By

Published : May 25, 2021, 12:14 PM IST

chahal
చాహల్

టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ రోహిత్​ శర్మ తనకు అన్నయ్య లాంటి వాడని అన్నాడు స్పిన్నర్ యుజ్వేంద్ర​ చాహల్​. అతడి వల్లే తాను ఐపీఎల్​ అరంగేట్రం చేయగలిగానని చెప్పాడు. ​

"రోహిత్​ భయ్యాతో నాకు గొప్ప అనుబంధం ఉంది. 2011లో ముంబయి ఇండియన్స్​ జట్టులోకి వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఒకరికొకరు తెలుసు. అతడి వల్లే నేను ఐపీఎల్​ అరంగేట్రం చేయగలిగా. నాకు ఎటువంటి అవకాశాలు రానప్పుడు, రోహిత్​ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగానే నన్ను తీసుకున్నాడు. నా రూమ్​కు వచ్చి 'నువ్వు మ్యాచ్​లు ఆడబోతున్నావ్' అని నాతో అన్నాడు. నేను ఆ మాట వినగానే ఆశ్చర్యపోయా. ఎందుకంటే అప్పటికే మా జట్టులో హర్భజన్​ సింగ్​, ప్రజ్ఞాన్ ఓజా లాంటి స్పిన్నర్లు ఉన్నారు. మేమెప్పుడు ముగ్గురు స్పిన్నర్లతో ఆడలేదు. టీమ్​ఇండియాలో రోహిత్​, కుల్దీప్​యాదవ్​తో విడదీయలేని బంధం ఉంది. వారిద్దరూ అన్ని పరిస్థితుల్లోనూ నాకు అండగా ఉన్నారు. మా మధ్య మంచి సంబంధాలు, అర్థం చేసుకునేతత్వం ఉంది. వాళ్లతో సరదాగా ఉంటా.. కానీ వాళ్ల మీద ఉన్న గౌరవంతో నేనెప్పుడు హద్దులు దాటలేదు. ముఖ్యంగా రోహిత్​ నాకు అన్నయ్య లాంటి వాడు."

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా.

చాహల్​.. 2013లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2014 నుంచి ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు కెరీర్​లో 108 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడగా.. 125వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: 'ఐపీఎల్​ నుంచి నేనే వెళ్లిపోదామనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.