ETV Bharat / sports

కోల్​కతా ఆటగాడికి జరిమానా.. బుమ్రాను మందలించిన రిఫరీ - kkr news

Bumrah Reprimanded: గురువారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో ముంబయిపై ఐదు వికెట్లు తేడాతో గెలిచింది కోల్​కతా నైట్​రైడర్స్​. అయితే.. కోల్​కతా ఆటగాడు నితీశ్​ రాణాకు మ్యాచ్​ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు నిర్వాహకులు. ముంబయి పేసర్​ బుమ్రాను రిఫరీ మందలించారు.

Nitish Rana fined 10 pc of match fees for Level 1 offence, Bumrah reprimanded

author img

By

Published : Apr 7, 2022, 1:42 PM IST

Bumrah Reprimanded: కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాటర్​ నితీశ్​ రాణాకు షాక్​ తగిలింది. ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​ ఫీజులో అతడికి 10 శాతం జరిమానా విధించారు నిర్వాహకులు. మ్యాచ్​ సందర్భంగా అతడు లెవల్​-1 నేరానికి పాల్పడగా.. రాణా అంగీకరించినట్లు యాజమాన్యం తెలిపింది. ''కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాటర్​ నితీశ్​ రాణాను మందలించడం సహా మ్యాచ్​ ఫీజులో 10 శాతం ఫైన్​ విధించాం. ముంబయితో మ్యాచ్​లో అతడు ఐపీఎల్​ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు'' అని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ముంబయి ఇండియన్స్​ సీనియర్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రాను రిఫరీ మందలించి వదిలేశారు. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లోనే ఐపీఎల్​ ప్రవర్తనా నియమావళిని బుమ్రా ఉల్లంఘించినట్లు బీసీసీఐ తెలిపింది. బుమ్రా కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కానీ అతడికి ఎలాంటి జరిమానా పడలేదని పేర్కొంది. ప్రవర్తనా నియమావళికి సంబంధించి లెవల్​-1 ఉల్లంఘనలు రిఫరీ చేతుల్లో ఉంటాయి. తుది నిర్ణయం మ్యాచ్​ రిఫరీదే. గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 5 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇవీ చూడండి: ప్యాట్ కమిన్స్ విధ్వంస బ్యాటింగ్​.. ముంబయిపై కోల్​కతా విజయం

'బేబీ ఏబీ' నో లుక్​ సిక్స్​ చూశారా? మ్యాచ్​కే హైలైట్​..!

ఈ 'ఛాంపియన్స్​'​కు ఈసారి ఏమైంది? హ్యాట్రిక్​ ఓటములతో అట్టడుగున..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.