ETV Bharat / sports

IPL Mini auction: గుంటూరు కుర్రోడికి లక్కీ ఛాన్స్​.. ఏకంగా ధోనీతో.​.. - ఐపీఎల్ మినీ ఆక్షన్​2023 లైవ్​ అప్డేట్స్​

ఆంధ్రాకు చెందిన యువ ఆటగాడు షేక్‌ రషీద్​పై మెగాలీగ్​లో మేటి జట్టైన చైన్నై సూపర్​ కింగ్స్ కన్ను పడింది. దీంతో మినీ వేలంలో అతడిని కొనుగోలు చేసింది. ఇంతకీ అతడు ఎవరంటే?

IPL MIni auction sheik rasheed
IPL Mini auction: గుంటూరు కుర్రోడికి లక్కీ ఛాన్స్​.. ఏకంగా ధోనీతో.​..
author img

By

Published : Dec 24, 2022, 11:20 AM IST

ఆంధ్ర యువ ఆటగాడు షేక్‌ రషీద్‌ ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం(డిసెంబర్ 23) జరిగిన మినీ వేలంలో రషీద్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌-2022లో అద్భుతంగా రాణించిన అతడు.. 2022 అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న యువ భారత జట్టుకు రషీద్‌ వైస్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అలా అతడు తన ప్రతిభతో ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు.

దీంతో ఐపీఎల్‌-2023 మినీ వేలంలో మాత్రం రషీద్‌ కల నెరవేరింది. ఏకంగా మెగాలీగ్​లో మేటి జట్టైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పడ్డాడు. దీంతో సీఎస్కేతో తన ఐపీఎల్‌ కెరీర్‌ను మొదలపెట్టనున్నాడు. ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూంను షేర్‌ చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  • 18 ఏళ్ల షేక్‌ రషీద్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఒక​ మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు.
  • చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్‌-14 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
  • 2022 అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
  • ఈ 2022 అండర్​ 19 ప్రపంచకప్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​పై 84 బంతుల్లో హాఫ్​ సెంచరీ చేసి.. భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
  • మొత్తంగా ఈ మెగాటోర్నీలో నాలుగు ఇన్నింగ్స్​లో 50.25యావరేజ్​తో 201 రన్స్​ చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి.
  • ఏపీఎల్​ 2022లో ఐదు ఇన్నింగ్స్​లో 159 రన్స్​ చేసి రాయాలసీమ కింగ్స్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
  • దేశీవాళీ క్రికెట్‌లో కూడా రషీద్‌ ఎం‍ట్రీ ఇచ్చాడు.
  • ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున అరంగేట్రం చేశాడు. నాగలాండ్​ జట్టుపై 37 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: అది అయ్యర్​ అంటే భలే సమాధానమిచ్చాడుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.