ETV Bharat / sports

అలా జరిగితే ముంబయికి గోల్డెన్ ఛాన్స్​- అంతా హార్దిక్ నిర్ణయంపైనే! : అశ్విన్ - ఐపీఎల్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్ ట్రేడ్

IPL 2024 Hardik Pandya Ashwin : ఐపీఎల్​ ప్లేయర్ల ట్రేడింగ్​ ఆదివారం చివరిరోజు కావడం వల్ల టీమ్ఇండియా స్టార్ ఆలౌండర్ జట్టు హార్దిక్ పాండ్య జట్టు మార్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయం భారత జట్టు ఆటగాడు రవించంద్రన్ అశ్విన్ స్పందిచాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..?

IPL 2024 Hardik Pandya Ashwin
IPL 2024 Hardik Pandya Ashwin
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 3:37 PM IST

Updated : Nov 26, 2023, 4:48 PM IST

IPL 2024 Hardik Pandya Ashwin : టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్‌ పాండ్య ముంబయి ఇండియన్స్‌ జట్టుకు తిరిగి రావడం దాదాపు పక్కాగా కనిపిస్తోంది. ఇలాంటి సమయాల్లో ప్లేయర్ల ఇష్ట ప్రకారమే ఫ్రాంచైజీలు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. హార్దిక్ నిర్ణయానికి గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదనే తెలుస్తోంది. రిటెన్షన్‌/రిలీజ్‌కు ఇవాళే చివరి రోజే కావడం వల్ల.. హార్దిక్‌ అంశంపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. విన్నింగ్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడినే కొనుగోలు చేయడం కూడా కొత్తగా ఉందనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌ స్పందించాడు. ఇది ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీకికు గోల్డెన్ ఛాన్స్‌ అవుతుందని వ్యాఖ్యానించాడు.

IPL 2024 Trade Window Hardik Pandya : 'ఒళ వేళ హార్దిక్ జట్టుమారడం నిజమైతే మాత్రం అది ముంబయి ఇండియన్స్‌కు అద్భుతమైన అవకాశం వచ్చినట్లే. దీనికి మించిన సూపర్ డీల్‌ ఉండదు. అయితే, ముంబయి ఇండియన్స్‌ జట్టును నుంచి మార్పిడి చేసుకునే ఆటగాళ్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్ ఇలా ట్రేడింగ్‌లో ఆటగాళ్లను ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అలా జరుగుతుందని అనుకోవడం లేదు. హార్దిక్‌ పాండ్య జట్టులోకి వస్తే ఫైనల్‌ జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఇలా కెప్టెన్లను కొనుగోలు చేసిన దాఖలాలు మూడు ఉన్నాయి. ఇంతకుముందు నేను, అజింక్య రహానె ఇలానే వెళ్లాం. ఇప్పుడు హార్దిక్‌ మూడో ఆటగాడు అవుతాడు' అని అశ్విన్ అన్నాడు.

Hardik Pandya Mumbai Indians : 'మాకు, పాండ్యకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. అతడు ఐపీఎల్ విన్నింగ్‌ జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడు. ఒక వేళ పాండ్య వస్తే మాత్రం గుజరాత్ జట్టు బ్యాలెన్స్‌ తప్పుతుంది. ఆ టీమ్ ఎలా సర్దుకుంటుందో చూడాలి మరి. అలాగే అతడిని సొంతం చేసుకోవడానికి ముంబయి ఇండియన్స్​ ఏం చేస్తుందనేది ఆసక్తికరం. ఎందుకంటే పాండ్యకు కోసం కనీసం రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వేలానికి రావాలంటే మరికొంత సొమ్మును పెట్టుకోవాలి. అయితే హార్దిక్‌ గురించి వస్తున్నవన్నీ ఇప్పటి వరకు రూమర్లుగానే భావించాలి'' అని అశ్విన్‌ వివరించాడు. దీంతో పాటు నిజంగా హార్దిక్‌ పాండ్య జట్టులోకి వస్తే.. తుది ఎలా ఉంటుందో కూడా అశ్విన్‌ అంచనా వేశాడు.

ముంబయి జట్టు (అంచనా) : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, టిమ్‌ డేవిడ్, హార్దిక్ పాండ్య, బుమ్రా, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జోఫ్రా ఆర్చర్/రిలే మెరిడిత్/జాసన్‌ బెహ్రాన్‌డార్ఫ్‌/మిచెల్‌ స్టార్క్‌/ప్యాట్ కమిన్స్‌.

శభాష్​ షమీ - ఒక్క పనితో మనసు గెలిచేశావ్!

క్రికెట్​కు డారెన్ బ్రావో వీడ్కోలు - కారణం అదేనా?

Last Updated : Nov 26, 2023, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.