ETV Bharat / sports

పంజాబ్​ కోసం రంగంలోకి పవర్​ హిట్టింగ్​ కోచ్ - punjab latest news

IPL 2022: పంజాబ్​ కింగ్స్​ జట్టు నూతన బ్యాటింగ్​ సలహాదారునిగా ఇంగ్లాండ్​కు చెందిన జూలియన్​ రోస్​వుడ్​ను నియమించింది. ఈ విషయాన్ని ఆ జట్టు సోషల్​ మీడియా ద్వారా వెల్లడించింది.

రోస్​వుడ్​
ross wood
author img

By

Published : Mar 14, 2022, 11:49 PM IST

IPL 2022: ఐపీఎల్​ 2022 త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో తమ జట్టుకు కొత్త బ్యాటింగ్​ సలహాదారున్ని నియమించింది పంజాబ్​ కింగ్స్. ఇంగ్లాండ్​కు చెందిన పవర్​ హిట్టింగ్​ కోచ్​​ జూలియన్​ రోస్​వుడ్​ను ఇందుకు ఎంపికచేసింది. ఈ మేరకు పంజాబ్​ కింగ్స్ సోషల్​ మీడియాలో ప్రకటన చేసింది.

పవర్ హిట్టింగ్ కోచ్​గా ప్రసిద్ధి చెందిన రోస్​వుడ్​కు.. ఐపీఎల్​ సహా బిగ్​బాష్​ లాంటి టీ20 లీగ్​ల్లో పనిచేసిన అనుభవం ఉంది. రోస్​వుడ్​ కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని పంజాబ్​ యాజమాన్యం తెలిపింది.

ఈ సారి జరిగిన మెగావేలంలో శిఖర్​ ధావన్​, జానీ బెయిర్​స్టో, కగిసో రబాడ, లివింగ్​స్టోన్​లను పంజాబ్​ కొనుక్కుంది. గత మూడు సీజన్లలోనూ పంజాబ్​ ఆరోస్థానంతోనే సరిపెట్టుకుంది. పంజాబ్​ చివరిసారిగా 2014లో ఫైనల్​లో అడుగు పెట్టింది. ఈ సీజన్​లో ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

ఇదీ చదవండి: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా శ్రేయస్​ అయ్యర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.