IPL 2022 MS Dhoni: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడో 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రెండు ఐపీఎల్ సీజన్లలో బ్యాటర్‌గా నిరాశపరిచాడు. 2021లో కెప్టెన్‌గా కప్పు సాధించిపెట్టినప్పటికీ.. అతడి బ్యాటింగ్ వైఫల్యాలు మాత్రం అలాగే కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ రీతిందర్ సోధి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో ఏళ్ల పాటు ఫినిషర్ పాత్ర పోషించిన ధోనీలో.. ఇప్పుడు ఆ సామర్థ్యం లేనట్లు కనిపిస్తోందని రీతిందర్ చెప్పుకొచ్చారు. మునుపటిలా మ్యాచ్‌లను ముగించలేకపోతున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో.. ధోనీకి కీలక సూచనలు చేశారు. 'అతడు కొంత సమయం తీసుకోవాలి. వచ్చీ రాగానే షాట్లు కొట్టే ఫినిషింగ్ రోల్ కంటే.. ముందుగానే క్రీజులోకి రావడం మంచిది. 10 లేదా 11వ ఓవర్లో క్రీజులోకి వస్తే బాగుంటుంది. సమయం దొరికినప్పుడు బౌలర్లపై ఆధిపత్యం చెలాయించవచ్చు' అని చెప్పుకొచ్చాడు.
సీఎస్కేను నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు ధోనీ. అయితే బ్యాటింగ్‌లో గత రెండేళ్లుగా విఫలమవుతున్నాడు. 2020 సీజన్లో 200 పరుగులు చేసిన కెప్టెన్ కూల్.. 2021లో 114 రన్స్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే.. ధోనీ ముందుగా రావాలని రీతిందర్ సూచిస్తున్నాడు. క్రీజులో సమయం వెచ్చించాలని కోరుతున్నాడు. మరోవైపు, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తాడని రీతిందర్ తెలిపాడు. వచ్చే సీజన్లో సీఎస్కేకు గేమ్ ఛేంజర్‌గా మారతాడని జోస్యం చెప్పాడు.
ఇదీ చదవండి:
IPL 2022: ఫ్యాన్స్ సంగతేంటి? ఎంత మందిని అనుమతిస్తారు?
కామెంట్రీ బాక్స్‌లోకి రవిశాస్త్రి రిటర్న్.. రైనా అరంగేట్రం...