ETV Bharat / sports

చెన్నైలో ధోనీ.. ఐపీఎల్ మెగా వేలం కోసం పక్కా స్కెచ్! - ipl 2022 news

IPL 2022 MS Dhoni: 2022 ఐపీఎల్​ మెగా వేలానికి రెండు వారాలే సమయం ఉన్న నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ ధోనీ చెన్నై చేరాడు. వేలం కోసమే ఇంత త్వరగా చెన్నై వచ్చినట్లు తెలుస్తోంది.

IPL 2022 MS Dhoni
ధోనీ
author img

By

Published : Jan 28, 2022, 10:21 AM IST

IPL 2022 MS Dhoni: 2022 ఐపీఎల్​ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12,13న బెంగళూరులో జరగనున్న వేలం కోసం జట్లన్ని సిద్ధమవుతున్నాయి. దీనికి రెండు వారాలే ఉన్న నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. గురువారం ఓ హోటల్​లో కనిపించాడు.

ఆటగాళ్ల ఎంపికలో జట్టు యాజమాన్యానికి ధోనీ సలహాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. గత సీజన్లలోనూ మెరుగైన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంలో ధోనీ కీలకపాత్ర పోషించారు. ఈసారి సీఎస్కే నలుగురు ప్లేయర్లను రిటైన్​ చేసుకుంది. అందులో ధోనీ, జడేజా, రుతురాజ్​, మొయిన్ అలీ ఉన్నారు. జడేజాకు రూ.16 కోట్లు కేటాయించగా, ధోనికి రూ.12కోట్లు, మొయిన్ అలీకి రూ.8 కోట్లు, రుతురాజ్​కు​ రూ.6 కోట్లు టీం యాజమాన్యం వెచ్చించింది. మిలిగిన ఆటగాళ్లను రిటైన్​ చేసుకోవడానికి సీఎస్కే ఇంకా రూ.48 కోట్లు ఖర్చు చేయనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'బుమ్రాకి కాదు.. కపిల్ దేవ్‌లా నిఖార్సైన ఆల్ రౌండర్‌కు పగ్గాలివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.