IPL 2022 Highest Runs: ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద. మ్యాచ్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకు.. ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు.. ప్రతీ ఆటగాడు బంతిని బౌండరీ లైన్ దాటించాలని ఆరాటపడతాడు. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా బ్యాటర్లు వారి పరుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో కొందరు బ్యాటర్లు ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడి భారీ పరుగులు సాధించారు. ఈసారి కూడా ప్లేయర్స్ ఇలాంటి ఇన్నింగ్స్నే ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరు? ఎన్ని పరుగులు చేశారు? వంటి వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..
విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మాజీ సారథి విరాట్ కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2013 నుంచి 2021 వరకు సారథ్యం వహించాడు. బ్యాటర్‌గా రాణించినా జట్టును ఒకసారి కూడా విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ మిగతా ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 199 ఇన్నింగ్స్ ఆడి 37.39 సగటుతో 6283 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 42 అర్ధ శతకాలు ఉన్నాయి.
శిఖర్ ధావన్
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గబ్బర్‌గా పేరుతెచ్చుకున్నాడు శిఖర్ ధావన్. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధావన్.. ఐపీఎల్‌లోనూ సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 5,197 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించిన రోహిత్ శర్మ.. ముంబయి జట్టుకు ఐదు సార్లు కప్పును అందించాడు. ఇక, ఐపీఎల్లో 208 ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. 31.17 సగటుతో 5611 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 40 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
సురేష్ రైనా
ఒకప్పుడు టీమ్ఇండియా మిడిలార్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన రైనా.. తర్వాత ఫామ్ కోల్పోయాడు. చాలాకాలం పాటు తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూసి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక, ఐపీఎల్లో అయినా అతడి ఆట చూడొచ్చనుకున్న అభిమానులకు ఫ్రాంఛైజీలు నిరాశ మిగిల్చాయి. రైనాను ఈ ఏడాది ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇప్పటివరకు 200 ఇన్నింగ్స్ ఆడిన రైనా 32.51 సగటుతో 5528 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.
డేవిడ్ వార్నర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బాల్ టాంపరింగ్ వివాదంతో ఓ ఏడాది ఆటకు దూరమయ్యాడు. తర్వాత 2019 ఐపీఎల్‌తో పునరాగమనం చేసిన వార్నర్.. వచ్చీరాగానే సత్తాచాటాడు. మళ్లీ తన ఫామ్ నిరూపించుకున్నాడు ఇప్పటివరకు మొత్తం 150 ఇన్నింగ్స్‌ల్లో 42.71 సగటుతో 5449 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 48 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఊరిస్తున్న టీమ్ఇండియా కెప్టెన్సీ.. ఐపీఎల్లో రాణిస్తారా?