ETV Bharat / sports

IPL 2022: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు వీరే! - ఐపీఎల్​ 2022 వేదికలు

IPL 2022 Bowlers: క్రికెట్​లో బౌల‌ర్ల రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మ బౌలింగ్‌తో మ్యాచ్ ఫ‌లితాల‌నే మార్చేసిన సందర్భాలున్నాయి. పిచ్ కాస్త బౌలింగ్‌కు అనుకూలిస్తే ఆ రోజు బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్​​ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్​లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం..

bravo
lasith malinga
author img

By

Published : Mar 9, 2022, 10:40 AM IST

IPL 2022 Bowlers: ఎంతో మంది క్రికెట్​ అభిమానులు వేచి చూస్తున్న ఐపీఎల్​ 15వ సీజన్​ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 26న జరిగే చెన్నై సూపర్​ కింగ్స్​- కోల్​కత్తా నైట్​రైడర్స్​ మ్యాచ్​తో లీగ్​ మొదలవ్వనుంది. ప్రతిఏటా ఈ టోర్నీ కోసం ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ లీగ్​లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 బౌలర్లు ఎవరు? ఎన్నెన్ని వికెట్లు పడగొట్టారు? వంటి వివరాలను తెలుసుకుందాం..

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

లసిత్ మలింగ

ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ గొప్ప బౌలర్​గా పేరు సంపాదించాడు. 122 మ్యాచ్​లు ఆడి 170 వికెట్లతో రికార్డు సృష్టించాడు. 2009లో ముంబయి ఫ్రాంఛైజీ ఇతడిని కొనుగోలు చేయగా 2019 వరకు ఆ జట్టులోనే ఆడాడు. గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల సీజన్​కు దూరమై.. 2021 మెగా వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు.

lasith malinga
లసిత్ మలింగ

మలింగ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్: 5/13

డ్వేన్ బ్రావో

ఐపీఎల్​లో 151 మ్యాచ్​లాడిన బ్రావో 167 వికెట్లు సాధించి లీగ్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. బ్రావోను ఈ ఏడాది చెన్నై సూపర్​కింగ్స్​ రూ.4.40 కోట్లకు​ కొనుగోలు చేసింది.

bravo
డ్వేన్ బ్రావో

డ్వేన్​ బ్రావో బెస్ట్ బౌలింగ్​ ఫిగర్స్: 4/22

అమిత్ మిశ్రా

టీమ్ఇండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్​లో 154 మ్యాచ్​లు ఆడి 166 వికెట్లు సాధించాడు. లీగ్​లో అత్యధిక వికెట్లు సాధించిన వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్​లో అమిత్​ మిశ్రాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

amith mishra
అమిత్ మిశ్రా

అమిత్​ మిశ్రా బెస్ట్ బౌలింగ్​ ఫిగర్స్​: 5/17

పీయూష్ చావ్లా

ఇప్పటివరకు 165 మ్యాచ్​లు ఆడిన పీయూష్​ చావ్లా 157 వికెట్లు సాధించాడు. లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్​కూ​ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2022 వేలంలో పీయూష్ చావ్లాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

piyush chawla
పీయూష్ చావ్లా

పీయూష్​ చావ్లా బెస్ట్​ బౌలింగ్​ ఫిగర్స్​: 4/17

హర్భజన్ సింగ్

ఐపీఎల్​లో 163 మ్యాచ్​లాడిన హర్భజన్ సింగ్ 150 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల లీగ్​కు భజ్జీ దూరమయ్యాడు.

harbhajna singh
హర్భజన్ సింగ్

హర్భజన్​ సింగ్​ బెస్ట్​ బౌలింగ్​ ఫిగర్స్​: 5/18

ఆ తర్వాత ఈ జాబితాలో ఆరో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (150) వికెట్లతో నిలిచాడు. ఈ ఏడాది రాజస్థాన్​ రాయల్స్​ తరఫున ఆడబోతున్నాడు.

ఇదీ చదవండి: Gujarat Titans: జేసన్​ రాయ్​ స్థానంలో ఆ ఓపెనర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.