ETV Bharat / sports

ఐపీఎల్​ 13: ఓవర్​నైట్​ స్టార్స్​ అయిన ఆటగాళ్లు​ వీరే!

author img

By

Published : Nov 4, 2020, 5:43 AM IST

ఈ సీజన్​లో అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడి కొంతమంది యువ ఆటగాళ్లు ఓవర్​నైట్​ స్టార్లు​ అయిపోయారు. దిగ్గజ ఆటగాళ్ల ప్రశంసలను పొందారు. మరి వారెవ్వరు? వారి సాధించిన రికార్డులు ఏమిటో తెలుసుకుందామా?

Zero to Hero
ఐపీఎల్​ 13

ఐపీఎల్​ 13 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అంతకముందు సీజన్లలాగే కొంతమంది యువ ఆటగాళ్లు తమ అసాధారణమైన ప్రతిభ, అద్భుతమైన ఇన్నింగ్స్​తో అందరీ దృష్టినీ ఆకర్షించారు. దేవదత్​ పడిక్కల్​, రాహుల్​ తివాతియా, రవి బిష్ణోయ్​, టి.నటరాజన్​, రుతురాజ్​ గైక్వాడ్​, వరుణ్​ చక్రవర్తి, అర్ష్​దీప్​ సింగ్​ తమ ఆటతో బాగా ఆకట్టకున్నారు. ఇక కార్తీక్​ త్యాగీ, తుషార్​ దీశ్​పాండే, రియాన్​ పరాగ్​, ప్రియమ్​ గార్గ్​, అబ్దుల్​ సమాద్​ కూడా తమకొచ్చిన అవకాశాలను బాగానే వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో వీరి రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.

పడిక్కల్​

బెంగళూరు జట్టు ఓపెనర్​ దేవదత్ పడిక్కల్​.. ఈ సీజన్​లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో తన జట్టు తరఫున అత్యధిక పరుగులు(472) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 14 ఇన్నింగ్స్​ల్లో ఐదు అర్ధ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్​గా నిలిచాడు. మొత్తంగా 51 ఫోర్లు, ఎనిమిది సిక్స్​లు కొట్టాడు.

padikal
పడిక్కల్​

తెవాతియా

రాజస్థాన్​ రాయల్స్​ ఆల్​రౌండర్​ రాహుల్​ తెవాతియా ఓవర్​ నైట్​ స్టార్​ అయిపోయాడు. పంజాబ్​తో జరిగిన ఓ మ్యాచ్​లో తన అద్భుతమైన ఇన్నింగ్స్​తో ఐదు సిక్స్​లు బాది అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఆ మ్యాచ్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్​లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి అదరగొట్టాడు.

tewatia
తెవాతియా

రవి బిష్ణోయ్​

ఈ సీజన్​తో ఐపీఎల్​ అరంగేట్రం చేసిన కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ లెగ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​ ఆదిలోనే అదరగొట్టేశాడు. స్టార్​ స్పిన్నర్​ అనిల్​ కుంబ్లే మాదిరిగా అదిరేటి బౌలింగ్​ చేశాడు. 14 ఇన్నింగ్స్​లో 12 వికెట్లు తీశాడు. తన బౌలింగ్​తో బ్యాట్స్​మెన్స్​కు చుక్కలు చూపించాడు. స్టార్​ ఆటగాళ్లైన వార్నర్​, బెయిర్​ స్టో, పంత్​, ఫించ్​, మోర్గాన్​ను​ పెవిలియన్​ చేర్చాడు.

ravi bishnoi
రవి బిష్ణోయ్​

టి.నటరాజన్​

సన్​రైజర్స్​ లెఫ్ట్​ ఆర్మ్​ పేసర్​ టి.నటరాజన్(యార్కర్ల స్పెషలిస్ట్​) ఈ సీజన్​లో అద్భుతాలు చేసిన ఆటగాళ్లలో ఒకడు. 13 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ​

natarajan
నటరాజన్​

గైక్వాడ్​

ఈ సీజన్​లో చెన్నై జట్టు పేలవమైన ప్రదర్శన చేసినా.. ఆ జట్టు బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్​ ఆడాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లలో ఇతడు ఒకడు అని చెప్పొచ్చు. ఆరు మ్యాచుల్లోనే 201 పరుగులు చేసి అందరి ప్రశంసలు పొందాడు. మూడు అర్ధ సెంచరీలు చేశాడు. సారథి ధోనీ సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు.

gaikwad
గైక్వాడ్​

వరుణ్​ చక్రవర్తి

కోల్​కతా నైట్​ రైడర్స్​ లెగ్​ స్పిన్నర్​ వరుణ్ చక్రవర్తి 13 మ్యాచుల్లోనే 17వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ సీజన్​లో అతడి ప్రదర్శనకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్​ ఇండియాలో చోటు కూడా దక్కింది.

varun chakravarthit
వరుణ్​ చక్రవర్తి

అర్ష్​దీప్ సింగ్​

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ నుంచి వెలుగులోకి వచ్చిన మరో ఆటగాడు​.. మీడియమ్​ పేసర్​ అర్ష్​దీప్​ సింగ్​. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 8వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్​ శర్మ, మనీశ్​ పాండే, రసెల్​ వంటి స్టార్​ ఆటగాళ్లను ఔట్​ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

arsh deep singh
అర్ష్​దీప్​ సింగ్

ఇదీ చూడండి మహిళా టీ20 ఛాలెంజ్​ షెడ్యూల్​పై ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.